ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ నేతల అనవసర రాద్ధాంతం: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నదీ జలాల వాటాలో అన్యాయం జరిగిందంటూ తెలంగాణ నేతలు దేశ రాజధానిలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. బచావత్ అవార్డు ప్రకారమే ఎపి, తెలంగాణలకు నీటిని కేటాయిస్తున్నారన్నారు. విభజన చట్టానికి నాడు అంగీకరించిన టి.నేతలు ఇపుడు కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలను అంగీకరించమంటూ ప్రకటనలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగా 512 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయని వివరించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను మంచినీటి విడుదలకు అమలు చేశారా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు.