పశ్చిమగోదావరి

శివాలయాల్లో పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 7: హరహర మహదేవ శంభో శంకరా అంటూ పట్టణంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుఝామున 2 గంటల నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్ సతీష్‌కుమార్ పర్యవేక్షణలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సినీ నటుడు పృధ్వీరాజ్, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తదితర ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసాపురం డిఎస్పీ అమరనాథనాయుడు పర్యవేక్షణలో సిఐలు దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు కె సుధాకర్‌రెడ్డి, పి తిలక్‌లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పూర్తి బందోబస్తు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అలాగే శ్రీ భీమేశ్వర జనార్ధన స్వామివారి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే స్థానిక శ్రీరాంపురంలోని సుబ్బారాయుడు ఆలయంలో కూడా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కొవ్వూరు: మహా శివరాత్రి పర్వదినం సోమవారం రావడంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రం భక్తులతో పోటెత్తింది. కొవ్వూరు పరిసర గ్రామాల నుండి వివిధ వాహనాలపై భక్తులు తరలివచ్చారు. దీంతో గోష్పాద క్షేత్రం మినీ పుష్కరంగా మారి శివనామస్మరణతో మార్మోగింది. గోష్పాద క్షేత్రంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుఝాము నుండే భక్తులు అధిక సంఖ్యలో గోష్పాద క్షేత్రానికి విచ్చేశారు. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్నాన ఘట్టంలో ఉన్న శివాలయం, పాత ఊరులోని చోడేశ్వర స్వామివారి దేవాలయం, సంస్కృత కళాశాల ప్రాంగణంలో ఉన్న పురాతన శివాలయం భక్తులతో నిండిపోయాయి. మున్సిపల్ ఛైర్మన్ సూరపని రామ్మోహన్, పట్టణ సిఐ పి ప్రసాదరావు, కమిషనర్ టి నాగేంద్రకుమార్, అగ్నిమాపక శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు తమ సేవలు అందజేశారు. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు తమ సేవలను అందించాయి. పాలు, పులిహోర, బిస్కెట్లు, మంచినీళ్లు అందజేశారు.

శివరాత్రి ఏర్పాట్లు పట్ల కలెక్టర్ సంతృప్తి
పోలవరం, మార్చి 7: మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను పరిశీలించి జిల్లా కలెక్టర్ కె భాస్కర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం పట్టిసం చేరుకున్న కలెక్టర్ పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించి, డిపిఒ సూర్యనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుండి భక్తుల తాకిడి, వారిని నది ఎలా దాటిస్తున్నారనే విషయాలను ఆర్డీవో శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ స్పీడ్ బోట్లో పెర్రీ పాయింట్ల వద్దకు చేరుకుని భక్తులు ఎక్కే బోట్లను పరిశీలించారు. రాత్రి సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలు లవన్న, శ్రీనివాసరావులు ఎఎస్పీ చంద్రశేఖరరావుకు ఆదేశించారు.

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
తాడేపల్లిగూడెం, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక శాఖా గ్రంథాలయం వద్ద ఈనెల 8 మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు సభ నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి జంధ్యాల పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా ఏడుగురు మహిళా ప్రముఖులను సత్కరించనున్నామన్నారు.