ఆంధ్రప్రదేశ్‌

శిక్షణ సంస్థలు తెలంగాణకు వెళ్లడంతో పోలీసు నియామకాల్లో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలులో ఏర్పాటుకు సన్నాహాలు : డిజిపి రాముడు వెల్లడి
కదిరి, డిసెంబర్ 26: పోలీసుశాఖకు సంబంధించిన పలు శిక్షణ సంస్థలు విభజన అనంతరం తెలంగాణ పరిధిలోకి వెళ్లడంతో కొత్త నియామకాల్లో జాప్యం జరుగుతోందని డిజిపి రాముడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పలు విభాగాలకు చెందిన శిక్షణ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉండేవన్నారు. విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు శిక్షణ సంస్థలు లేకుండా పోయాయన్నారు. ముఖ్యంగా పోలీసు, అటవీ, నిఘా, దర్యాప్తు విభాగాలకు చెందిన శిక్షణ సంస్థలు లేని కారణంగా నియామకాలు చేపట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపధ్యంలో అనంతపురంలోని పిటిసిని తాత్కాలిక శిక్షణ సంస్థగా వినియోగించుకుంటున్నామన్నారు. కర్నూలు జిల్లాలో అన్ని విభాగాలకు సంబంధించిన శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 2500 ఎకరాల అటవీ భూమిని పరిశీలించామన్నారు. దీనికి అనుమతులు వచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి సైతం తీసుకువెళ్లామన్నారు. త్వరలో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. అనుమతులు లభించగానే శిక్షణ సంస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. హోంగార్డుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నామని త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు.
కాగా మహిళల కోసం ప్రత్యేకంగా కౌనె్సలంగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా డిజిపి దృష్టికి తెచ్చారు. మహిళల తరలింపుపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై డిజిపి స్పందిస్తూ మహిళల తరలింపువివరాలపై జిల్లా ఎస్పీని ఆరా తీసారు. మహిళల తరలింపు ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించారు. డిజిపి వెంట ఎస్పీ రాజశేఖర్ బాబు, కదిరి డీఎస్పీ వెంకటరామాంజనేయులు ఉన్నారు.