కృష్ణ

త్వరలో కమిషనరేట్ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అదనపు సిబ్బంది కోసం ప్రతిపాదనలు
* 18 శాతానికి తగ్గిన క్రైం రేటు
* డిజిపి రాముడు
విజయవాడ , డిసెంబర్ 31: త్వరలో నగర పోలీసు కమిషనరేట్ బలోపేతం కానుంది. సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్న కమిషనరేట్‌కు ఖాళీల భర్త, అదనపు సిబ్బంది కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు డిజిపి జెవి రాముడు వెల్లడించారు. కాగా ఈ ఏడాది గత రెండేళ్ల కంటే క్రైం రేటు 18శాతం తగ్గుముఖం పట్టింది. అయితే నగరానికి ఉన్న పాధాన్యత రీత్యా అధిక ప్రచారం వల్ల నేరాలు అధికంగా జరుగుతున్నట్లు కనిపిస్తుందని డిజిపి అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన 2015లో నగర పోలీసు కమిషనరేట్ క్రైం రేటును వివరించారు. రాజధానిగా రూపాంతరం చెందినా.. సరిపడా సిబ్బంది లేక కొట్టుమిట్టాడుతూ పనిభారంతో సమస్యలు ఎదుర్కొంటున్న కమిషనరేట్‌కు అదనపు బలగాలు కావాలనే అవశ్యకతను ఆయన వివరించారు. ఇప్పటికే ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలో అదనపు సిబ్బంది ఇచ్చేందుకు ప్రభుత్వ పరిశీలిస్తోందన్నారు. గత ఏడాది కమిషనరేట్ పరిధిలో 7388 కేసులు నమోదైతే.. ఈ సంవత్సరం 6050కేసులు నమోదైనట్లు తెలిపారు. అదే 2013లో 8285 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంటే 2013తో పోలిస్తే.. 27శాతం, గత ఏడాదితో పోలిస్తే 18శాతం క్రైం రేటు తగ్గిందన్నారు. కాగా గత ఏడాదిలో 20హత్య కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 24కు పెరిగింది, కిడ్నాప్‌ల సంఖ్య 28కి తగ్గింది. ప్రధానంగా చీటింగ్ కేసులు 2014లో 328 నమోదు కాగా, ఈ ఏడాది 392కి పెరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య గత ఏడాది 315 నమోదు కాగా, 348కి పెరిగింది. మహిళ సంబంధ కేసులకు వస్తే గత ఏడాది 1036 కేసులకు గాను ఈ సంవత్సరం 498కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి గత ఏడాది 49 నమోదు కాగా, ఈ ఏడాది 27కేసులు నమోదయ్యాయి. చోరీ కేసుల్లో ఈ ఏది 2086 కేసులు నమోదు కాగా, 706 కేసులు చేధించబడ్డాయి, వీటిలో పోయిన సొమ్ము 11 కోట్ల 85లక్షల 60వేల 354 రూపాయలకుగాను, 3కోట్ల 71లక్షల 69వేల 354 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవరీ జరిగింది. గత ఏడాదితో పోలిస్తే రికవరీ తక్కువగానే ఉంది. స్నాచింగ్ కేసులకు సంబంధించి 395 కేసులు నమోదు కాగా, 178కేసులు చేధించగా పోయిన సొత్తు కోటి 72లక్షల 63వేల 729 రూపాయలకుగాను, 71లక్షల 48వేల 679 రూపాయల సొత్తు రికవరీ అయింది. ఇక రోడ్డు ప్రమాదాల విషయానికొస్తే గత ఏడాదిలో నమోదైన కేసుల కంటే తక్కువ నమోదైనా.. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. 2014లో 1510కేసులు నమోదు కాగా 335 మంది చనిపోగా, 1540మంది గాయపడ్డారు. ఈ ఏడాది 1474 నమోదు కాగా, 362మంది చనిపోయారు. 1505 మంది గాయపడ్డారు. సైబర్ నేరాలు గత ఏడాది 30 కంటే ఈ సంవత్సరం 41కి పెరిగాయి. పెరిగిన ఆర్థిక, సైబర్ నేరాలను కట్టడి చేయడంతోపాటు, రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య నియంత్రించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇక అమరావతి పోలీసు కమిషనరేట్ పరిశీలనలో ఉందన్నారు. విలేఖరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌తోపాటు అదనపు డిజిపిలు సురేంద్రబాబు, ఆర్‌పి ఠాకూర్, విఎస్‌కె కౌముది, ఏబి వెంకటేశ్వరరావు, ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.