అంతర్జాతీయం

ఢాకాలో 9 మంది ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో సోమవారం అర్ధరాత్రి ఉగ్రవాదులను పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. 10 మంది ఉగ్రవాదులు ఓ భవనంలోని నాలుగో అంతస్థులోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. తెల్లవారుజామున ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు ఢాకా డీసీపీ మసూద్‌ అహ్మద్‌ వెల్లడించారు. ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌కి చెందిన జమయేతుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదసంస్థకు చెందినవారేనని పేర్కొన్నారు.