Others

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

248.ఇంద్రువర గర్వమున నేను యుద్ధమునకు
బిల్వవజ్రమునను గొట్టె బల విరోధి
తలయు కాళ్ళును గుండెలో దిగబడంగ
వలదు రుూ రూపు జంపుము వజ్రి యంటి

249.బ్రహ్మ వరమున నీవు దీర్ఘాయు వౌట
జంప జనదని ప్రాణ రక్షణకు వజ్రి
హృదయమున నోరు దీర్ఘ బాహువుల నిచ్చె
ప్రాణులను దిని బ్రతుకు సాగించుచుంటి

250.పుండరీక నయన పురుహూత వందిత
రామచంద్ర అగ్నిలోన నన్ను
ద్రోయుడయ్య నిజశరీరంబు పొందినే
దెల్పు వాడ నీకు పాయ మరసి

251.లక్ష్మణుండంత యగ్నిని రగులజేసి
నాకబంధు శరీరము నగ్నిద్రోయ
అంబరమ్మున దివ్యదేహంబు తోడ
నిలచి బోధించె గంధర్వుడీవిధమున

252.ఋష్యమూక నగమున సుగ్రీవుడనెడు
వానరేశ్వరుడు గలడు వానితోడ
మైత్రి నెరపుడీ యెచట భూపుత్రి యున్న
వెదకగల సమర్థుండును వినయశీలి

253.విజయమగు మీకు రఘువంశ విబుధులార!
అనుచు దీవించి గంధర్వుడరిగె దివికి
వాని బోధను శబరి నివాసమునకు
నేగ వారినిం గని యెదురేగి శబరి

254.నేడు నాతపంబు నెరవరెనని భిల్ల
వనితయర్థ్యపాద్య విధులరామ
చంద్రు పూజ జేసి మధుర ఫలంబుల
దెచ్చి విభున కర్పణంబు జేసె

255 రాచంద్రుడంత నాధర్మ పరురాలి
కుశల మడిగి నీగరు ప్రభావ
మెంతొ వినుతి జేసె గంధర్వ విభుడు నా
కెరుక పరచుమమ్మ శబరి యనగ

256 ‘‘రామచంద్ర! గనుము గరుమతంగుల శక్తి
యజ్ఞవేది వెలుగుచున్న దింక
మీరు చిత్రకూట నగమందు నున్న నా
సమయ మందు నేగి రయ్య దివికి

257 నిరత వుపవాసముల కృశీ భూతులైన
గురులు సప్త సాగరముల గ్రుంకులిడగ
ఇంటి ముంగిట కుం బిలిపించుకొనిరి
యా పవిత్ర జలములివె గనుము రామ!

258 గురుని మహిమను వివరించి కూర్మి శబరి
రామ సౌమిత్రుల ననుజ్ఞ వేడి యోగ
సాధనమున దేహంబు త్యజించి పుణ్య
లోకముల కేగె నా చిర భక్తురాలు
259 రామ లక్ష్మణులా భక్తురాలి దలచు
కొనుచు నేగిరి పంపా తటంబు చీంత
కమల కల్హార కుసుమ సంకలిత పంప
నీరముల గ్రోలి శుక పికరవము వినుచు

260 పుష్పిత తరుల మత్తిల్లి కూజితముల
పరవశింప జేసెడు కోయిల స్వరంబు
సీత కంఠ స్వరము గుర్తుజేయ నిలజ
లేమికి వ్యథ జెందు సీతేశు జూచి

261 ‘‘అన్న! ధీజన రత్మమా! తమకు నిట్లు
తగునె నా పన్ను రీతి శోకంబు జెంత
పృథివి నుత్సాహ శీలికి దుర్లభంబు
లేదనెడు మాట తమరికి దెలియనిదియె’’

262 అనుగు తమ్మునిచే బోధితాత్ముడైన
రామచంద్రుడు గజరాజగమను డౌచు
భూరుహంబుల పర్వత శ్రేణి దాటి
చనగ ననుసరించె సుమిత్ర నందనుండు
*

టంగుటూరి మహాలక్ష్మి