Others

గృహస్థు ధర్మమే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు సామాన్య గృహస్థు. పైగా ఉపాధ్యాయుడు. దాంతో నిత్యకర్మానుష్ఠానం చేసుకొంటూ పిల్లలకు వేదాధ్యయనం చేయిస్తూ తన తల్లిదండ్రుల సేవ చేసుకొంటూ దినవారీ కార్యాలను చేసేవాడు. అట్లాంటి ప్రవరునికి తీర్థయాత్రలు చేయాలనే తీరని కోర్కె ఉండేది. దానితో అతడు నిత్యమూ ఎవరైనా తీర్థయాత్రలు చేసిన వారు కనబడితే వారికి ఆతిథ్యమిచ్చి వారు చూసివచ్చిన వివరాలను చెప్పమని అడుగుతుండేవాడు.
ఒకరోజు ప్రవరుని దగ్గరకు ఒక సిద్ధుడు వస్తాడు. ఆ సిద్ధునికి అతిథి పూజ చేస్తాడు ప్రవరుడు. భోజననాంతరం సిద్ధుని దగ్గర కూర్చుని తన కిష్టమైన తీర్థయాత్రావిశేషాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. మాటల మధ్యలో నేను గృహస్థు నైనందువల్ల ఏ తీర్థాక్షేత్రాలను దర్శించలేకపోతున్నానని ఆవేదన చెందుతాడు.
ప్రవరుని మనక్లేశాన్ని చూసి సిద్థుడు ప్రవరునకు ఒక లేపనాన్ని ఇస్తాడు. ఆ లేపనాన్ని పాదాలకు పూసుకొని ఎక్కడికి వెళ్లాలనుకొన్నా నిముషాల్లో అక్కడికి చేరుకోవచ్చు.
సిద్ధుడు ఇచ్చిన పాదలేపనం తో చాలా ప్రదేశాలు నిముషాల్లో తిరిగి రావచ్చునని ఎంతో సంతోషపడ్డాడు ప్రవరుడు. అపుడు సిద్ధుడు ప్రవరునితో ‘ఓప్రవరా! నీవు తీర్థయాత్రలు చేయలేదని చింతించనవసరం లేదు. ఎందుకంటే నీవు గృహస్థు ధర్మాన్ని ఆచరిస్తున్నావు. కనుక అతిథి అభ్యాగతుల సేవ చేయగలగుతున్నావు. పైగా తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించకుండా వారి సేవను చేస్తున్నావు. నీ భార్యాబిడ్డల ఆలనాపాలన కూడా చేస్తున్నావు. నీకు వేదం విధించిన ఉపాధ్యాయ వృత్తిని కూడా అలసత్వం లేకుండా చేస్తున్నావు. అంటే నీ కర్తవ్యాలన్నింటిని సరిగా పాటిస్తున్నావు కనుక భగవంతుడు నిన్ను మెచ్చుతాడు. నీకేవిధమైన కష్టాలను దరిచేరనివ్వడు. కర్తవ్యపాలనే మనిషి చేయవలసిన మొట్టమొదటి పని. సన్యాసులు ఒకదగ్గరే ఉండకూడదు కనుక వారు దేశాలను చుట్టి వస్తుంటారు అది వారికి అనువైన పని.
కనుక నీవు ఇతర ప్రాంతాలను, క్షేత్రాలను తిరిగి చూడలేదని కినుక మానివేయి. నీకు చాలా ఇష్టం కనుక నీకు అత్యంత ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి చూసి రావాలనుకొన్నపుడు ఈపాదలేపన సాయంతో నీవు వెళ్లవచ్చు అని సిద్ధుడు ప్రవరునితో చెప్పాడు. ఆ సిద్ధుడిచ్చిన పాదలేపనం వల్లే ప్రవరుడు హిమాలయ సౌందర్యాలను చూస్తాడు.

- ఉషశ్రీ తాల్క