Others

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

263. అన్న దమ్ములట్లు పురోగమించి ఋష్య
మూక నగసమీపంబున సంచరింప
దేవసముల నద్భువ భద్రమూర్తులైన
రాజనందనులను కపిరాజు జూచి

264. ‘‘మంత్రులార! జూచితిరె వారి శరచాప
ధరుల ధీరుల ముని వేషధరుల వాలి
పంపునన్ వచ్చి నట్టున్నవారు గాక
తాపసులకేల శరచాప ధారణములు?’’

265. అనుచు వానరేశ్వరుడు భయమున నిప్పు
ద్రొక్కినగతి నిటున్నటు బరువు పెట్ట
వాయునందనుడా కపివర్యుజేరి
‘‘కీశవల్లభ నీకేటికీ భయమ్ము?

266. వాలియైన వాని యనుచరులైనను
ఈనగమ్ము బ్రాక విడుతు రసువు
లంచు నామతంగ వౌని శాపంబిచ్చె
ననియెరుంగవె కమలాప్తతనయ!’’

267. అన సుగ్రీవుడైనను వారల నిజరూప
మరసి రమ్మని కరువలి పుత్రు ననుప
భిక్షు రూపము దాల్చి భూపతులు నున్న
నెలవు కుంజని పావని నయము మెరయు

268. ‘‘ఎవరయా! మీరు సుందరు లవనిలోన
సంచరింపగ వచ్చిన యశ్వినులన
నొప్పుచున్న వారలు బలదర్పములను
శక్ర సములుగ గన్పట్టు చున్నవారు

269. నార చీరెలు ధరియించి కాననమున
దిరుగుటకు హేతు వెమొకొ ధీరులార!’’
ఋష్య మూక నగమున సుగ్రీవుడనెడు
వానరేశ్వరుడు గలడు వినయ శీలి

270. అన్న వాలిచే రాజ్యమునుండి వెడల
నడుపబడి యధిక వ్యధ ననుభవించె
మీతో మైత్రి గోరి నను మీవద్ద కనిపె
అతని మంత్రిని నేను భూకాంతులార
271. భిక్షు వేషంబున నిటకు వచ్చినాడ
నగచరుండను హనుమంతు డండ్రు నన్ను
ఋష్య మూకంబు నుండిట కొచ్చుటయ్యె
ననుచు నంజలి ఘటించె ననిల సుతుడు

272. రామచంద్రుడతని మాటలకెంతయో
మనమలరగ లక్ష్మణునితొ ననియె
యెవని మనము దలచు చుంటిమో యారవి
సుతుడె మనల డాయ వచ్చె ననుజ

273. ప్రగ్గడ యట సుగ్రీవున కిమ్మహాత్ము
డింత తడవు మాటాడిన యితని మాట
వొక్కటేనియు నపశబ్దితంబుగాదు
మూడు వేదములెరుగు వాక్యజ్ఞుడితడు

274. ఈతనిని మంత్రిగా పొందు నేత సకల
కార్యముల నెల్ల సాధించు కొరత లేక
యితనికిం ప్రతివచన మిమ్మంచు బల్కె
రఘుకులాంబుధి సోముడు రాఘవుండు

275. అంత సౌమిత్రి యాకపిశేఖరునితో
మధురవౌ స్వరమున బల్కె ‘మానవీయ!
మీ ప్రభువు గుణముల విని మేము నింత
దూర మాతనిం గలువ నేతెంచినాము.’’

276. హనుమ మనమున బొంగుచు దినప సుతుడు
రాజ్యలక్ష్మిని మరల రుూ రాజవరుల
వలన బొందలడని వీరలకును
రవిజుతోపని యున్నదని గ్రహించె
*

టంగుటూరి మహాలక్ష్మి