సబ్ ఫీచర్

క్రిమి శాస్తమ్రు - విజ్ఞానము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రాచీనులకు క్రిములకు చెందిన విజ్ఞానము తెలియదని నేటి తరంలో పాశ్చాత్య విద్యానుయాయుల సందేహము. అందువల్ల 1822లో పుట్టి 1859వరకూ జీవించిన ‘పాశ్చర్ లూయిస్’ అనే ఫ్రెంచి శాస్తవ్రేత్త క్రిమి సిద్ధాంతాన్ని కనుగొన్నాడని చెబుతున్నారు. నిజానికీ క్రిములను గురించిన విజ్ఞానము మన ప్రాచీనులకు వేదకాలం నుండే బాగా తెలియును. అధర్వణ వేదంలోనూ, ఆయుర్వేద శాస్త్రాలలోనూ రుూ సూక్ష్మ క్రిములకు చెందిన పరిజ్ఞానం బహు విస్తారంగా చర్చించబడింది. ఉదాహరణకు కొన్ని ప్రమాణాలను చూద్దాం. ఆయుర్వేద శాస్త్రాలలో అనేక రకాల క్రిములు వాటి స్వరూప స్వభావాలు, ఏ ఏ క్రిములు ఏఏ రోగములకు కారణమవుతాయి, వాటికి సంబంధించిన చికిత్సా వివరాలు చెప్పబడ్డాయి. వాగ్భటాచార్యుడు ‘నిదానము’ అనే ఆయుర్వేద గ్రంథములో అనేక రకాల సూక్ష్మక్రిములు, వాటి నివారణ చికిత్సలను వివరించారు. అధర్వణ వేదంలోని రుూ క్రింది మంత్రాలను చూడండి.
మంత్రం:
అవ్యాంత్య్రం శీర్షణ్యమథో పార్షేర్‌ష్ణేయం
క్రిమోన్ / అవస్కరం వ్యధ్వరన్ క్రియోన్, వచసాజం
భియామసీ యే క్రిమియః పర్వతేషు
వనేష్వోధీషు పశుష్యస్స్వంతః యే అస్మాకం
తన్వమా విశుః సర్వం తద్ధన్విజనిమ క్రీమేణాం (ఇతి అధర్వణ వేదే)
మంత్రార్థం: కడుపులో (ప్రేవులలో) పుట్టే క్రిములు తలలో పుట్టేవి, ప్రక్క ఎములలోపుట్టేవి, అశుద్ధి ప్రదేశములలో పుట్టేవి, ఇసుకలో (మట్టిలో) పుట్టేవి- మొదలగు అనేక క్రిములను ప్రయోగము చేత (ఔషధము) నాశనము చేతును. పశువులయందు పుట్టెడు అనేక రకముల క్రిములు, మనుష్యుల శరీరములలో ప్రవేశింపగలవో అట్టి క్రిములను, వాటి పుట్టుకను నాశనము చేయుదును. ఇట్లనేక మంత్రములు, సూక్తములు అధర్వణ వేదంలో కలవు.
ఆయుర్వేద మందలి ఈ క్రింది మంత్రం (శ్లోకం) చూడండి.
‘‘విశ్వరూపం, చతురక్షం, క్రిమి సారంగ మర్జునం
శృణామ్యస్య సృష్టిరపి వృచ్ఛామి, యచ్భిరః ఇతి ఆయుర్వేదే
మంత్రార్థం: అనేక రూపములు, ఆకారములు కలిగినవి నాలుగు కళ్ళు కలిగినవి, తెల్లని రంగు కలిగిన రుూ క్రిములను నాశనమొనరింతును.
పైవిధంగా క్రిములు సూక్ష్మక్రిములను గురించిన పరిజ్ఞానము, అనేక విధములుగా అధర్వణ వేదమందు ఆయుర్వేదాది శాస్తమ్రులయందు ఎంతో విస్తారముగా వివరింపబడినది. క్రిములవల్ల వచ్చెడు వ్యాధులకు చికిత్సా పద్ధతులు క్రిమి సంహార ప్రయోగములు కూడా వందలాదిగా వివరింపబడ్డాయి. మంత్ర శాస్తమ్రందు, యజురారణ్యకమునందు క్రిమి సంహార ప్రక్రియ, ప్రయోగములు కలవు. యధార్థమిట్లుండగా పాశ్చర్ లూయిస్ క్రిమి సిద్ధాంతము కనుగొన్నాడని చెప్పడం హాస్యాస్పదం.
ఖగోళ విజ్ఞానం గురించి భారతీయులు చరిత్రకందని కాలంనుండి ఎంతో కృషి చేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నక్షత్రాలు, గ్రహములు గురించి మాత్రమే కాక తోకచుక్కల గురించి కూడా ఎనె్నన్నో విషయాలు ఆవిష్కరించారు. ఆ విషయాలన్నీ ఎప్పటికీ నిత్య నూతనములే. ముఖ్యంగా ప్రాచీన మహర్షులలో ‘అగస్త్య - భారద్వాజ, జైమినీ’ మహర్షులు తోకచుక్కల విజ్ఞానాన్ని గురించి అనేక గ్రంధాలలో విపులంగా వివరించారు. యదార్థమిట్లుండగా, ఆ విషయాన్ని పక్కనపెట్టి క్రీస్తుశకం 1656 నుండి 1742 వరకూ జీవించిన ‘హారీ ఎడ్మండ్’ అనే ఆంగ్లేయ శాస్తవ్రేత్త తోకచుక్కలను కనిపెట్టాడని చెప్తున్నారు. దీనిని బట్టి 17వ శతాబ్దము వరకూ భారతీయులకు తోకచుక్కల గురించి తెలియదనుకోవాలా?
మన శాస్త్రాలేమి చెబుతున్నాయో చూద్దాం.
క్రియాసార తంత్రమను గ్రంథంలో
శ్లో బాణస్థ ధూమకేతూనాం మండల స్యాష్ఠమాంతరే
త్రికోటి సప్త లక్షతి సహస్ర ద్విశతో పరి
ఏకవింశతి సంఖ్యాకాః వర్తనే ధూమకేతవః
విద్యుద్గర్భాస్తేషు ధూమకేతవో అష్టసహస్రాకాః
మహా కాలాదయో రౌద్రౌ విద్యుద్వాదశలోచనాః
తేషు ద్వాదశ సంఖ్యాకాః ప్రశస్తా ధూమకేతవః
శ్లోకార్థం: ఆకాశమందలి ఎనిమిదవ మండలమునందు, మూడు కోట్ల ఏడు లక్షల మూడు వేల రెండు వందల యిరువది ఒక్క తోకచుక్కలు కలవు. వీనియందు భయంకరమైన ‘మహాకాలాది’ తోకచుక్కలు ఎనిమిదివేలు కలవు. ఇవి విద్యుత్తును ధరించి వున్నవి. వీటియందు మిక్కలి భయంకరమైనవి అనగా అత్యధికముగా విద్యుత్ప్రవాహము కలిగివున్నవి 12 కలవు.
ఇవి మిక్కిలి ప్రశస్తమైనవి. అగస్త్య మహర్షి రుూ పనె్నండు తోకచుక్కల పేర్లు శక్తితంత్రంలో ఈ విధంగా చెప్పారు చూడండి.
శ్లో రోచిషా, దాహకా, సింహే, పతంగా కాలనేమి కా
లతా, వుందా, రటా, చండీ, మహూర్మే, పార్వణే మృడా
ఉల్కానేత్ర స్థితాహ్యేతే, విద్యుతోద్వాశ క్రమాత్
శ్లోకార్థం: 1.రోచిషా 2.దాహకా 3.సింహే 4.పతంగా 5.కాలనేమి 6.లతా 7.వుందా 8.రటా 9.చండీ 10.మహూర్మే 11.పార్వణే 12.మృడా అనెడి 12 తోకచుక్కలు (ఉల్కలు) ఎక్కువ విద్యుత్ ప్రవాహమ కలిగివున్నవి. ఇవి 12కూడా ‘ఉల్కానేత్ర’ యనెడి తోకచుక్క ఆకర్షణలోనున్నవి. *

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590