ధర్మ ధ్వజం

మాతృభాషలోనే పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కువమంధి ఇంగ్లండు దేశంనుండి వచ్చిన సేనానులు ఆంగ్లేయులు కారు. మన దేశంలో పనిచేసిన 84 మంది బ్రిటిషు గవర్నర్ జర్నల్స్ ఎవ్వరూ ఆంగ్లేయులుకారు. వాళ్లు బ్రిటిష్ అధికారులు మాత్రమే. రాబర్ట్ క్లైవ్ స్కాటిష్, వౌంట్ బాటన్ ఐరిష్ భాషకు చెందినవాళ్లు. అలాగే ప్రపంచంలోని ధైర్య సాహసాలుగల వ్యక్తులుగా ప్రవర్తించిన గాలీబార్డ్, నెపోలియన్, బిస్మార్క్, రాబర్ట్‌క్లైవ్ ఎవ్వరూ ఆంగ్లేయులు కారు. కాబట్టి ఆంగ్లేయులు, ఆంగ్లం ఎలా గొప్పవారో, గొప్పదో మనం ఆలోచించాలి.
ఆంగ్ల భాషను వ్యతిరేకించడమంటే క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తున్నారన్న భావన మన దేశంలో వుంది. క్రైస్తవంలోని ప్రముఖుడైన ‘ఈసా మాతృభాష’ హర్మెట్. ఇది మన దేశంలోని బంగ్లా, అస్సామి లాంటిది. మొదటి బైబిల్ హర్మెట్ భాషలోనే ప్రచురించబడింది. ప్రపంచంలోని గొప్ప గొప్ప మత సిద్ధాంతాలేవీ ఆంగ్లంలో చెప్పబడలేదు. ఇస్లాంలో ప్రముఖ గ్రంథమైన ఖురాన్, క్రైస్తవ గ్రంథమైన బైబిల్, హయోదీల గ్రంథమైన ‘జెండా అవెస్థా’ హిబ్రూ భాషలో ఉన్నాయి. అలాగే మన వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు- అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ప్రపంచ ధార్మిక వ్యవస్థను మార్చి, నడిపిస్తున్న ఏ గ్రంథాలు ఆంగ్లంలో లేవు. మనకు స్వాతంత్య్రం వచ్చాక గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు కూడా పార్లమెంటులో ఆంగ్ల ప్రసంగాలు చేస్తున్నారు. న్యాయ, శాసన పాలన, విద్యారంగాల్లో ఇప్పటికీ ఆంగ్లమే రాజ్యమేలుతుంది. రైతులు ఉపయోగించే క్రిమిసంహారక మందుల సీసాలపై, ఎరువులు బస్తాలపై ఆంగ్లంలో సూచనలు ఉంటాయి. చదువురాని రైతులు, ఆంగ్లంరాని వాళ్ళు వాటిని ఎంతకు కొనుక్కోవాలో వాటి ఉపయోగం ఎలా చెయ్యాలో తెలియక నష్టపోతున్నారు. అలాగే గ్రామీణ ప్రజలకు అమ్మే మందుల డబ్బాలపై, సీసాలపై ఆంగ్ల భాషనే ఉండడంవల్ల వాటి ఉపయోగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే మన దేశంలోని ధైర్య సాహసాలు గల జాతులకు ఎవ్వరికీ ఆంగ్లం రాదు. వారు సైన్యంలో చేరడంవల్ల సైన్యం బలం బాగా పెరిగింది. కాని అక్కడ కూడా ఆంగ్లం పెత్తనం పెరిగి శిక్షణలోని సూచనలు దేశభక్తిపూరిత ప్రసంగాలు వాళ్లకు అర్థంకాక సైనిక వ్యవస్థ కూడా పతనమయ్యే పరిస్థితులున్నాయి. మన దేశంలోని న్యాయ, శాసన, పాలన, విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఆంగ్ల భాషా పెత్తనం పెరిగి సామాన్యుడి బ్రతుకు దుర్భరంగా మారిపోయింది. ఆంగ్లేయులు మన దేశం నుండి వెళ్లినా, వారు మనపై రుద్దిన బానిసఛాయలు మనల్ని వదలడంలేదు. ఒక సర్వే ప్రకారం సంవత్సరానికి 17 కోట్లమంది ఆంగ్లం రాక, చదువులో వెనుకబడుతున్నట్లు తెలుస్తున్నది. కాబట్టి మన దేశం నుండి ఆంగ్లాన్ని ఏడు సముద్రాల ఆవలికి తోసెయ్యాలంటే ఈ క్రింది పనులు చేయాలి.
- ఆంగ్లం తొలగించి మాతృభాషలో పాలన జరిగేట్టు ప్రజలు ప్రభుత్వంపై వత్తిడి చేయాలి.
- 1967 భాషా చట్టం మార్చుకోవాలి. రాజ్యాంగ సవరణ చేసి దేశీభాషల్ని పునరుద్ధరించుకోవాలి.
- మన పేర్లలోని ఆంగ్లాన్ని తీసివేయాలి.
- మన సంతకాలు, ఉత్తరాలు మాతృభాషలో కొనసాగాలి. మన పిల్లలకు ఆంగ్ల సంస్కృతి నుండి వచ్చిన పేర్లు కాకుండా, మన సంస్కృతి ప్రతిబింబించే పేర్లు పెట్టాలి. - మన చిన్న పిల్లలకు ఆంగ్ల గేయాలు నేర్పడం మాని, దేశభాషల్లోని బాలగేయాలు నేర్పాలి. - దేశ పౌరులంతా కలిసి విదేశీ భాషను గెంటెయ్యాలి. - సంస్కృత భాషను, హిందీ భాషను కేజి నుండి పిజి దాకా సాహిత్యంలో విభాగంగా (సాహిత్యము, సాంకేతిక విద్యాగ్రంథములు) దేశ వ్యాప్తంగా తప్పనిసరిచేయాలి.
- జాతీయ స్థాయిలో సంస్కృత విశ్వవిద్యాలయం స్థాపించబడాలి.
- సంస్కృత గ్రంథాలను దేశ భాషల్లోకి తర్జుమా చేయించాలి. ప్రాచీన తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిని సురక్షితము చేసి డిజిటలైజ్ చేయాలి. జ్ఞాన సంపదను భావితరాలవారికి అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
- సంస్కృత నిఘంటువు, హిందీ నిఘంటువులు తయారుచేయబడాలి.
- వేద పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పండిత స్థాయి వరకు వేదాలు ఇతిహాసాలను బోధించాలి.
- పరిశోధన మరియు అభివృద్ధి’ పథకాలను విశ్వవిద్యాలయాలు చేపట్టాలి.
(కీ.శే రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసాల సౌజన్యంతో)
ఉపన్యాసం ఇవ్వడం ఎలా?
మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురా
మాటలచేత భూపతులు మన్ననచేసి పురంబులిత్తురా
మాటలచేతఁ గామినులు మన్ననచేసి సుఖంబులిత్తురా
మాటలు నేరకున్న నవమానము న్యూనము మానభంగమున్
మాటలు మెచ్చుకొని దేవతలు వరాలిస్తారు. మాటలు మెచ్చుకొని రాజులు పురములిస్తారు. ఆ మాటలనే మెచ్చుకొని స్ర్తిలు సుఖాలిస్తారు. కాబట్టి మాటలు నేర్వకున్న అవమానం, మానభంగం తప్పదు.
నిజమే! మాటలు మనిషికి ఆభరణాలు. మనిషిలోని విషయ వ్యక్తీకరణకు, కార్యదక్షతకు మచ్చుతునకలు. మాట్లాడేశక్తి అందరికీ ఉండవచ్చు. కానీ అందరినీ ఆకట్టుకొనే విధంగా మాట్లాడడం ఒక కళ. అది ఇంట్లో వ్యక్తుల మధ్య జరిపే సంభాషణలో కావచ్చు, కేవలం పది మంది మిత్రుల మధ్య కావచ్చు, ఓ కార్యాలయానికి వెళ్ళి పనిని సాధించే క్రమంలో కావచ్చు, వేల మంది కూర్చున్న సభలో కావచ్చు; ఎక్కడైనా మాటల చాతుర్యం, చమత్కారం ఉంటే గాని గుర్తింపు సాధించలేం.

--ఇంకావుంది...

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com