ధర్మసందేహాలు

బర్బరీకులు ఎవరు, ఎక్కడివారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మహాభారతంలో ‘బర్బరీకుని’ గురించి వివరించ ప్రార్థన.
- గంగాధర్, ఇరగవరం
వసిష్ఠ మహర్షి దగ్గర వున్న నందినీ ధేనువును విశ్వామిత్రుడు బలత్కారంగా అపహరించడంకోసం ప్రయత్నించగా, అప్పుడు వసిష్ఠ మహర్షి అనుమతితో ఆత్మరక్షణకోసం నందినీ ధేనువు తన శరీర భాగాలలోంచి రకరకాల ఆటవిక జాతుల్ని సృష్టించేసింది. వారిలో ఆమె పాల నురుగు నుంచి పుట్టినవారు ‘బర్బరులు’ వారంతా కలిసి విశ్వామిత్రుణ్ణి ఓడించటం పూరె్తైనాక సృష్టికావించబడిన ఆటవిక జాతివారంతా తలోమూల అటవీ ప్రాంతాలలో ఆటవికులుగా స్థిరపడిపోయారు. ఆ వరుసలో బర్బరులు నివసించిన ప్రాంతానికి బర్బరీక దేశమనే పేరు ఏర్పడింది. ఆ దేశ నాయకుడికి బర్బరీకుడు అనే వ్యవహారం ఏర్పడింది. రాజసూయ యాగ సందర్భంలో పాండవులు బర్బరీకులను జయించినట్లుగా భారతంలో వున్నది.
* కోడలు, కూతురు పురిటి రోజులలో మాసికాలు గాని, ఆబ్దికాలు గాని వస్తే వాటిని పెట్టాలా?
ప్రత్యామ్నాయమేమైనా కలదా?
- నిట్టల రామలక్ష్మి, సికిందరాబాదు
పురుడు రాకముందు అయితే పెట్టితీరాలి. కోడలికి పురుడు వస్తే 10 రోజులు పురుడు వెళ్లేదాకా ఆగి, శుద్ధిరోజున మాసికాదులు పెట్టాలి. అలాగే కూతురికి పురుడు వస్తే మూడురోజులు పురుడు పాటించి, శుద్ధిరోజున మాసికాదులు పెట్టాలి. వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇలా పితృకర్మలను ఆచరించటంవల్ల పుట్టిన పిల్లలకు కూడా శుభం కలుగుతుంది.
* పితృకార్యాలలో మాంసాహారాన్ని వినియోగించవచ్చునా?
- వి.రామకృష్ణారావు, అనంతపురం
స: కలియుగంలో దీనికి ధర్మశాస్త్ర సమ్మతి లేదు...
* మన శాస్త్రాలలో పురాణాలలో, మునులు, యతులు, ఋషులు అని వచ్చింది కాని సన్యాసి అని రాలేదు. శంకరాచార్యులకు పూర్వం సన్యాసి అని ఎక్కడా వచ్చిన రూఢి లేదు. ఈ సన్యాసి పదం ఎక్కడనుంచీ వచ్చిందో తెలుపగలరు?
- పి.వి.్భర్గవ, విజయవాడ
యతి అన్నా, సన్యాసి అన్నా ఒకటే. స్మృతి గ్రంథాలలోనూ, ధర్మశాస్త్ర నిబంధనల గ్రంథాలలోనూ నాలుగు ఆశ్రమాల ప్రసక్తి స్పష్టంగా వుంది. వాటిలో నాలుగవ ఆశ్రమం పేరే సన్యాస ఆశ్రమం. దాన్ని స్వీకరించినవాడు సన్యాసి లేక యతి, లేక భిక్షువు ఇత్యాది నామధేయాలు కనిపిస్తున్నాయి. కనుక శంకరాచార్యులకు వెనుక సన్యాసాశ్రమానికి రూఢి లేదనటం తగదు.
* మహర్షులకు గూడా ముని పల్లెలు, పుత్రాది సంసారము వుంటే ఇంక వారికీ, సామాన్య గృహస్థులకీ గల భేదము ఏమిటి?
పి.వి. రావు, సూర్యాపేట
ఆశ్రమపరంగా ఇద్దరూ గృహస్థులే. జీవనపరంగా మహర్షులది లౌకిక స్పర్శలేని తపోమయ జీవితము. వారి పిల్లలు కూడ ఆ మార్గంలోనే ఉండేవారు. అందువల్లనే వారి తపస్సులు ఈ జీవితంలోనే సిద్ధించేవి. అదే వారి ప్రత్యేకత.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి