ధర్మసందేహాలు

ఆవులను దండించినా పాపమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విభీషణుడు రావణుని సొంత సోదరుడేనా? - శివాజీరావు, హైద్రాబాద్
ఒకే తల్లితండ్రులకు పుట్టిన సోదరులే. తల్లి పేరు కైకసి, తండ్రి పేరు విశ్రవోముని.
* పేరు తెలియని వారిని అగస్యభ్రాత అంటారు. కాని ఆగస్తునికి తమ్ముడు లేడా! ఉన్నా అయనంత ప్రతిభావంతుడు కాదా! - పార్వతీశం, ఒంగోలు
శ్రీరాముడు తన అరణ్య సమయంలో కావాలని వెళ్ళి దర్శించిన ప్రముఖ మహర్షులను గురించి ప్రస్తావిస్తున్న సమయంలో వాల్మీకి మహర్షి ‘‘సుతీణం చాప్యగస్త్యం చ ఆగస్త్యభ్రారతం తథా:’’అని పద ప్రయోగం చేశాడు. సుతీక్ష్ణనీ, అగస్త్యునీ మరియు అగస్త్యభ్రాతనీ శ్రీరాముడు దర్శించెను- అని భావము. అగస్త్యభ్రాత పేరు చెప్పలేదు. ప్రముఖుడని మాత్రము అంటున్నాడు. దీనినిబట్టి ప్రతిభ వుండి కూడా ప్రసిద్ధిలోనికి రానివారిని ఆగస్త్యభ్రాతలనడం పండితులలో ఒక సామెతగా మారింది.
* కాకులు లేనిచోట కాకి పిండం పెట్టినా ఫలితం వుంటుందా?
- నిట్టల రామలక్ష్మి, సికింద్రాబాదు
శాస్త్రాలు మానవులని శాసిస్తున్నాయి కాని కాకులను శాసించవు. కాకులకు పిండం పెట్టడమనేది మానవులకోసం ఉద్దేశించబడిన విధి. అందువల్ల కాకులున్నాయా లేవా? అనే విచారణ మనకు అవసరం కాదు. చెప్పినది ఆచరించడం మన విధి.
* ఆవులను, గేదెలను పాలివ్వలేదని దండిస్తే పాపం చుట్టుకుంటుందా?
- నల్లపాటి సురేంద్ర, హైద్రాబాద్
మూగ జీవుల్ని ఎప్పుడైనాసరే దయగానే చూడాలి. అదలించటం, బెదిరించటం మించి తీవ్ర దండనం చేస్తే పాపం తప్పదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి