ధర్మసందేహాలు

వాలికి తగిన శిక్షే అంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శ్రీరామునికి వాలికి ఏ విధమైన విరోధమూ లేదు. ఎందుకని వాలిని రాముడు సంహరించాడు?
- తలారి బలరాం , మచిలీపట్నం.
రామాయణంలో వాలి సూటిగా శ్రీరాముడినే ఈ మాట అడిగాడు. అక్కడ వ్రీరాముడు చక్కని వివరణ ఇచ్చాడు. దాని సారాంశమేమంటే - శ్రీరాముడికి అతని తండ్రి వనవాసం విధించాడు. అంతమాత్రం చేత అతని రాజప్రతినిధిత్వం తొలగిపోదు. అందువల్ల అరణ్య రాజ్యంలో ఆటవిక జాతులలోగల ధర్మ వ్యవస్థకు భంగం కలిగినప్పుడు ఆ అధర్మాన్ని శిక్షించి అక్కడి ధర్మాన్ని స్థాపించాల్సిన బాధ్యత శ్రీరాముడి మీద ఉంది. అందుకే ఆటవిక వానర ధర్మ వ్యవస్థను అతిక్రమించిన వాలిని శ్రీరాముడు దండించవలసి వచ్చింది. - అని ఈ సమాధానానికి వాలి తృప్తిపడి తన తప్పును అంగీకరించారు.
* పితృకర్మలలలో భోజనాదులకు ఏ ఏ ఆకులు ప్రశస్తం? - ఎ.మురళీనాథ శాస్ర్తీ, కర్నూలు
యజ్ఞకర్మలలో ఏ పవిత్రవృక్షాలను ప్రస్తావించారో వాటి ఆకులనే పితృకర్మలలో గూడా వాడటం శ్రేష్టమని శాస్త్ర వచనం. వీటిలో పలాశం (మోదుగ) , మర్రి, అరటి వంటివి ప్రథమ స్థానంలోకి వస్తాయి. ఇవేవీ దొరకనప్పుడు మాత్రమే ఇతర ఆకులను వాడాలి.
* కేదారేశ్వరుని నోముకు ప్రశస్తం అయిన రోజు చెప్పగలరు? - రామారావు, నల్లగొండ
కార్తికంలోని శుక్లపక్షంలో కార్తిక పూర్ణమికి అతి దగ్గరగా ఉండే సోమవారం ప్రశస్తమైనది.
* దేవతలను హింసించే రాక్షసులకు శుక్రుడు గురువెలా అయ్యాడు? - రామలక్ష్మి, సికింద్రాబాదు
రాక్షసులందరూ దుర్మార్గులు కారు. పైగా వారు ఒకేతండ్రి బిడ్టలు. వారిలో ఎవరి మానాన వారు గా వారి వారి రాజ్యాలను పాలించుకున్నవారు చాలామంది ఉన్నారు. ఆ వంశాలకు శుక్రాచార్యుడు గురవయ్యాడు. ఆ పరంపరలో కొందరు దుర్మార్గ శిష్యులు తారసపడినప్పుడు వారి గురుత్వాన్నుంచీ తప్పించుకోవడం ఆయనకు సాధ్యం కాదు. వారిలో బలి చక్రవర్తి లాంటి వారికి తగిన మనో వికాసం సంభవించిన సందర్భాలలో ఆయన వారికి బ్రహ్మ విద్య కూడా బోధించాడని యోగవాశిష్ట్యాది గ్రంథాలలో ఉంది.
* చనిపోయినవారి పేరుతో చేసే దాన ధర్మాల ఫలితం వారికి చేరుతుందా?
- ఎస్. రామజోగి, పిఠాపురం
ధర్మరాజు తన తండ్రియొక్క స్వర్గలోక ప్రాప్తికోసం రాజసూయయాగం చేశాడు. దీన్ని వ్యాస నారదాది మహర్షులు దగ్గర వుండి చేయించారు. దీనిని బట్టి శాస్ర్తియమైన విధానంతో చేసే ధర్మ క్రియలు పితృదేవతలకు చేరుతాయని ధ్రువపడుతోంది కదా.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి