ధర్మసందేహాలు

పద్మము, శంఖము, చక్రము - అనేవి వేటికి ప్రతీకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శ్రీసూక్తం అంటే లక్ష్మీదేవిని స్తుతించేది అనీ, పురుషసూక్తమంటే శ్రీమహావిష్ణువును స్తుతించేదనీ మాకు తెలుసు. ఇంతకు మించిన విశేషాంశాలు వుంటే తెలపండి.
- కె. సుబ్రహ్మణ్యం, కావలి
శ్రీసూక్తం అంటే - సమస్త దేవీ మూర్తులలోనూ గల దివ్యత్వాన్ని కీర్తించే సూక్తం. పురుషసూక్తంలో ‘‘పురుష’’ అనే పదానికీ సర్వాంతర్యామి అయిన పరమాత్మ అనేదే అసలైన అర్థం. అందుకే విష్ణుపూజలలో మాత్రమే గాక శివాభిషేకంలో గూడా దీనిని వినియోగించాలని శివసంకల్ప ప్రక్రరణంలో మహాన్యాసంలో ఉంది.
* ఆధ్యాత్మిక పరిభాషలో పద్మము, శంఖము, చక్రము - అనేవి వేటికి ప్రతీకలు.
- కె. వివేకానంద రెడ్డి, కొంకుదురు
పద్మం సర్వతోముఖ వికాసానికి, పాపస్పర్శ లేని పవిత్రతకు, మంచి ఆలోచనలకు ప్రతీక. శంఖం ఓం కారానికీ, అనాహతనాదానికీ, సంపదలకు ప్రతీక. చక్రం కాలగమనానికీ, భూమ్యాకాశ సంధికి, దుష్టసంహారానికి దుశ్చింత నివారణకూ ప్రతీక.
* గయలో పిండ ప్రదాన సందర్భంలో మనకు ఇష్టమైన కూరగాయ, పండు వదలమని చెబుతారు. గదా దీనికి పితృకర్మలకూ సంబంధం ఏమిటి?
- జ్ఞాన ప్రసూన కోవూరు
గయను కేవలం పితృకర్మక్షేత్రంగా మనం దర్శిస్తున్నాం. అది సముచితం కాదు. అక్కడ బ్రహ్మతీర్థ సూర్యతీర్థాది తీర్థస్థానాలనేకం వున్నాయి. అది గాక, అది యమధర్మరాజ పుత్రిక అయిన ధర్మశిలాక్షేత్రం. అందువల్ల అక్కడ చేసే ఆధ్యాత్మిక సాధన విశేష ఫల ప్రదం అవుతుంది. అందుకనే ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన భాగమైన జిహ్వాచాపల్య పరిహారానికి ప్రతీకగా అక్కడ కూరల పండ్ల పరిత్యాగాన్ని మన మహర్షులు వ్యవస్థ చేశారు.
* వేద పఠన విశిష్టత చేస్తే లాభం ఏమిటి ? - పుణ్యవతి, వైజాగ్
అర్థంతో నిమిత్తం లేకుండానే, కేవలం శబ్దతరంగశక్తిచేత పరిసర వాతావరణాన్ని ఆధ్యాత్మిక తరంగాలతో నింపగల శక్తి వేదపఠనానికి ఉన్నది. ఐతే గురూపదేశ పూర్వకంగా చేసినపుడు మాత్రమే ఆ ఫలితాలు సిద్ధిస్తాయి.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి