ధర్మసందేహాలు

ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉండాలన్నదానికి శాస్త్రం ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఇటీవలి కాలంలో అక్కడక్కడ స్ర్తిలు అంత్యక్రియలు చేయటం వింటున్నాము. ఇది శాస్త్ర సమ్మతమేనా?
- ఎస్.హెచ్. శివాజీరావు, హైదరాబాదు
మన ధర్మశాస్త్ర గ్రంథాలలో దీనిని సమర్థించే వాక్యాలేమీ లేవు
* ద్వైత విశిష్టాద్వైత, అద్వైత సిద్ధాంతాలలోని విభేదాలను స్థూలంగా తెలుపగోరెదను - శివ, వరంగల్లు
ఈ ప్రశ్నకు సమాధానం చాలా పెద్దది. సూత్రప్రాయంగా చెప్పుకోవాలంటే పరమాత్మ ప్రభువు వంటివాడని బోధించేది ద్వైత సిద్ధాంతము. జీవుడు పరమాత్మ యొక్క అంశభూతుడని బోధించేది విశిష్టాద్వైతము, జీవాత్మ పరమాత్మలకు భేదం లేదని బోధించేది అద్వైతము.
* అగ్ని దేవుడికి ఎన్ని నాలుకలు, వాని పేర్లేమి?
- సాయిరామానంద స్వామి, పొదల కొండపల్లె
అగ్ని దేవునకు వున్న నాలుకలు ఏడు. అవి. 1. కాళి, 2. కరాళి, 3. మనోజవ, 4. సులోహిత, 5. సుధూమ్రవర్ణ, 6. స్ఫులింగిని లేక ఉగ్ర, 7. విశ్వరూప లేక ప్రదీప్త.
* సహజంగా అర్థనారీశ్వర రూపంలో పార్వతీ అమ్మవారు పరమేశ్వరునికి వామభాగంలో ఉంటుంది కదా. మరి శ్రీ అలమేలు మంగమ్మ శ్రీవేంకటాచలపతికి దక్షిణభాగంలో ఉండడానికి గల ఆంతర్యము తెలుపగలరు
- అనిల్. ఆచంట
బ్రహ్మదేవుడు తన వామభాగంలో స్ర్తిమూర్తిని కుడి భాగంలోంచి పురుష మూర్తిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. దానిని బట్టి భార్యాభర్తలలో భార్యను ఎడమ భాగంలోను, భర్తను కుడి భాగంలోను కూర్చోబెట్టే సంప్రదాయాన్ని స్మృతులు కొన్ని స్వీకరించాయి. వైఖానస ఆగమం మాత్రం ఈ పద్ధతిని అంగీకరించలేదు. భార్య పురుషుడికి హృదయ స్థానేయురాలని పురుషుని యొక్క యోగహృదయం కుడి పక్క వుంటుంది. కనుక భార్యను పురుషుని యొక్క కుడి పక్క కూర్చుండబెట్టాలని వైఖానస ఆగమం శాసిస్తోంది. తిరుమలలో పూజావిధానాలన్నీ వైఖానస ఆగమం ప్రకారం నడుస్తాయి. కనుక అక్కడ అలమేలు మంగాదేవిని వేంకటాచలపతి స్వామికి కుడి ప్రక్కక కూర్చోబెట్టే సంప్రదాయం ఏర్పడింది.
* నిష్కామ కర్మానుష్ఠానము ఏయే కాలాల్లో చేయవచ్చును?
ఎం. రాజు, హుజూరాబాద్
సర్వకాలసర్వావస్థలలోనూ నిష్కామత్వ స్థితిని సాధించగలిగేటట్లయితే ఏ కాలంలోనైనా నిష్కామ కర్మాను ష్ఠానము చేయవచ్చును.
**

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి