ధర్మసందేహాలు

కల్కి అవతారదర్శనం ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శ్రీరాముడు తండ్రి ఆజ వల్ల వనవాసానికి వెళ్లవలసి వస్తే వెళ్లుగాక! లక్ష్మణుడు అలాంటి ఆజ్ఞ ఏదీ లేకుండానే భార్యను వదిలి అన్నతో అడవికి వెళ్లటం న్యాయమా?
రావుల లలితమ్మ, సూళ్లూరు పేట
కలియుగ జీవులకు భ్రాతృభక్తి శిఖరాయమాణంగా వుండే త్రేతాయుగానికి చెందినవాడు లక్ష్మణుడు. అందుకే ఆయన తండ్రి అనుమతితోనే అన్నగారి సేవకు బయలుదేరినాడు. పతివ్రత అయిన ఊర్మిళ ఈ విషయంలో భర్తకు నిండు హృదయంతో సహకారం అందించింది. కనుక లక్ష్మణ స్వామి చర్యలో అధర్మం ఏమీ లేదు.
* మహాభారత యుద్ధం ముగిసినాక శ్రీకృష్ణుడు అర్జునుడిని రథం దిగమని ఆదేశించాడు. అర్జునుడు రథం దిగగానే రథం భస్మమై పోయింది. దీనికి కారణం ఏమిటి అన్న అర్జునుడికి భీష్మ, ద్రోణ, కర్ణాదుల అస్త్ర ప్రభావాలు శ్రీకృష్ణుని వలన నిలబడిపోయి వున్నాయని శ్రీకృష్ణుడు తన ప్రభావాన్ని ఉపసంహరించగానే అవి రథాన్ని భస్మం చేశాయని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇదేమిటి? అర్జునుడు వీరుడుకాడా? ఎదుటి వీరుల అస్త్రాలను నివారించే శక్తి అర్జునునికి లేదా? వివరించగలరు
- టి. ఎస్. ప్రకాశరావు, విజయవాడ
భీష్మ ద్రోణాదులు సామాన్యులు కారు. వాళ్లు అస్తవ్రిద్యలలో అర్జునుణ్ణి మించినవారు. ఆ విషయం అర్జునుడికి కూడా తెలుసు. అందుకే కోరి శ్రీకృష్ణుని తెచ్చి తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు. అర్జునుడు నర మహర్షి అవతారం. మానవ శక్తికి సంకేతం. శ్రీకృష్ణుడు నారాయణమహర్షి అవతారం. ఇతడు దైవశక్తికి సంకేతం. దైవశక్తి కలసి వచ్చినప్పుడే మానవ శక్తికి రక్షణ ఉంటుందని నిరూపించట కోసమే శ్రీకృష్ణ పరమాత్మ అర్జున రథ దహన ఘట్టాన్ని ప్రదర్శించాడని మనం గ్రహించాలి.
* త్రేతాయుగంలోను, ద్వాపర యుగంలోను ఎపుడు రాముడి, కృషుడి అవతారాలు వచ్చాయ? అదేవిధంగా కలియుగంలో ఏ అవతారం రాబోతోంది? ఎప్పుడు వస్తుంది?
త్రేతా ద్వాపర యుగాలలో కూడా భగవత్ అవతారాలు యుగాంతాలలోనే వచ్చాయి. కలియుగాంతంలోగూడా కల్కి అనే పేరుతో దశమావతారం రాబోతోందని మన పురాణాలు చెబుతున్నాయి.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035. vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి vedakavi@serveveda.org