ధర్మసందేహాలు

గీతను విన్నవారెందరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాలప్రవాహంలో ఎటువంటి పక్షపాతము లేదు కదా! అటువంటప్పుడు, యమగండం, వర్జ్యం, దుర్ముహూర్తం అని నిర్ణయించుకోవటం సమంజసమా? (కొవ్వూరి వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు)
కాలప్రవాహంలో పక్షపాతం లేని మాట నిజమే కానీ, కాలం అంతా ఏకరూపమే అని చెప్పగలమా? ఎండాకాలంలో వరి నాట్లు వేయగలమా? అందుకనే మహర్షులు తమ సుదీర్ఘమైన తపోదృష్టి ద్వారా కాలప్రవృతితలోగల సూక్ష్మభేదాలను గుర్తించి వాటిని యమగండాది నామధేయాల ద్వారా మనకు బోధించారు. వాటిని అనుసరించి ఏ సమయంలో ఏ పనిచేయాలో తెలిసికొని చేయటం మన కర్తవ్యం.
* శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించేటప్పుడు ఇంకా ఎవరెవరు విన్నారు? (సాయిరామానందస్వామి, పొదలకొండపల్లె)
అర్జునుడి పతాకంలో ప్రతిష్టింపబడిన వున్న ఆంజనేయుడు విన్నాడు. వ్యాస వరప్రసాదితుడై యుద్ధ సన్నివేశాలను గమనిస్తున్న సంజయుడు విన్నాడు. శ్రీకృష్ణపరమాత్మ యొక్క దివ్య లీలలను తమ దివ్యదృష్టుల ద్వారా నిత్య జాగరూకులై పరిశీలిస్తున్న వ్యాసనారదాది మహర్షులు అనేకమంది విన్నారు. శ్రీకృష్ణుడి బోధ పూర్తయినాక, సంజయుడి ద్వారా విన్న అదృష్టశాలి ధృతరాష్ట్రుడు.
*పుష్కరాలకు ఆరునెలల ముందు ఆరునెలల తరువాత వివాహాదులు చేయకూడదంటున్నారు. నిజమేనా? (అక్షతల మురళీనాథశాస్ర్తీ, అవుకు)
పుష్కరాలనుబట్టి వివాహాది శుభకార్యాల నిషేధం శాస్త్రంలో ఎక్కడా లేదు. గురువు సింహరాశిలో వున్నప్పుడు, అనగా గోదావరీ పుష్కరాలు జరుగుతున్న సమయంలో మాత్రమే, కొన్ని ప్రాంతాల వారికి శుభకార్యాల నిషేధం వుంది. గురువు మఘా నక్షత్రంలోనూ, పూర్వఫల్గుని ప్రథమపాదంలోనూ వుండగా శుభకార్యాలు చేయరాదు. ఆ తర్వాత గురువు మిగిలిన సింహరాశి భాగంలో వున్నప్పుడు గంగా, గోదావరీ నదుల మధ్యలో మాత్రం వివాహ ఉపనయనాదులు పనికిరావు. ఈ విషయంలో మరికొన్ని మినహాయింపులు కూడా వున్నాయి. వాటిని స్థానిక పెద్దల ద్వారా తెలుసుకోవచ్చు.
* * *

- కుప్పా వేంకట కృష్ణమూర్తి