ధర్మసందేహాలు

ముడులకూ సంఖ్యానియమమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యజ్ఞోపవీతానికి ఎన్ని ముడులు ఉండాలి? - యన్.రామలక్ష్మి
బ్రహ్మచారులకు ఒక ముడి చాలును. గృహస్థులకు కనీసం రెండు ముడులు వుండాలి. మూడవ ముడి ఉత్తరీయానికి ప్రతినిధి, నాలుగవ ముడి ఆరోగ్యానికి ప్రతినిధి. మూడునాలుగు ముళ్ళు ఐచ్ఛికాలు.
*శ్రీరామ జన్మదినంనాడే కల్యాణం ఎందువలన?
వాల్మీకి రామాయణంలో వివరంగా లేదు. కానీ, ఇతర రామాయణాలలో కొన్నిచోట్ల సీతారామ కల్యాణం చైత్రశుక్ల నవమినాడే జరిగింది అని వున్నది. అందువల్ల శ్రీరాముడికి జన్మదినోత్సవ, కల్యాణ దినోత్సవాలు ఒకేరోజున జరుగుతున్నాయి.
* బ్రాహ్మణులు కుక్కలను పెంచుకోవచ్చునా?
- కె.వి.యల్.స్వామి, హైద్రాబాద్
ఇది శాస్త్ర సమ్మతమైన విషయం కాదు. శునకాలకు మానవులలోని ఆధ్యాత్మిక తరంగాలను పీల్చివేసుకొనే శక్తి వుందని, అందుచేత వాటిని ముట్టుకోవడంవలన మానవులలో పవిత్రత తగ్గి అపవిత్రత సంక్రమిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలలో వుంది.
* ‘సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’ అంటే ఏమిటి?
ఏ దేవతకు నమస్కారం పెట్టినా అది కేశవుడికే చేరుతుంది అని ఈ వాక్యానికి స్థూల అర్థం. ఇక్కడ కేశవుడు అంటే త్రిగుణాలకూ అతీతుడైన సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మ అని అర్థం.
* కన్యాదాన సమయంలో కన్యాదాత వరునిచేత ‘నాతి చరామి’అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. అలాంటి ప్రతిజ్ఞను వధువుచేత చేయిస్తున్నారా?
మన దేశంలో పురుషులకు బహుభార్యత్వం కొంతకాలంపాటు శాస్తస్రమ్మతంగా వుండేది. ఆరోజులలో వరుడు ‘నాతి చరామి’అని ప్రతిజ్ఞచేసేవాడు కాదు. తరువాతి కాలంలో పురుషుడియొక్క బహుభార్యాత్వాన్ని తిరస్కరంచేందుకోసం ఈ ప్రతిజ్ఞ ఏర్పడింది. స్ర్తికి బహుభర్తత్వం అనేది ఏనాడూ లేనేలేదు. ఆమెయొక్క ఏక పాతివ్రత్యం సర్వకాలసిద్ధం. అందుచేత ఆమె వేరుగా ‘నాతిచరామి’ అని ప్రతిజ్ఞ చేయవలసిన పని లేదు.

కుప్పా వేంకట కృష్ణమూర్తి vedakavi@serveveda.org