ధర్మసందేహాలు

ముక్తికోసం ఏమి చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అంతరాత్మ అంగుష్ఠ ప్రమాణమని కఠోపనిషత్తు ఉపసంహారంలో యముడు నచికేతునకు ఉపదేశించెనని ఒకచోట చదివియున్నాను. మంత్ర పుష్పంలో ‘నివారశూకవత్తన్వీ’అని అంతరాత్మ వరి ధాన్యపుగింజ ముక్కంత చిన్నది అని చెప్తున్నారు. ఈ రెంటిలో ఏది సరైన ప్రమాణము?
(పి.వి.శేషాచార్యులు, నక్కపల్లి)
కఠోపనిషత్తులో చెప్పినది జీవాత్మయొక్క పరిమాణము. మంత్రపుష్పంలో చెప్పినది పరమాత్మయొక్క ప్రతిఫలన స్థానము. అనగా సర్వవ్యాపియైన పరమాత్మను గుర్తించేందుకు అనువైన స్థానము. ఈ భేదాన్ని గమనిస్తే పైరెండు వాక్యాలలోనూ విభేదము వుండదు.
* నా వయస్సు 85 సంవత్సరాలు. చేతనైన స్తోత్రాలు పారాయణ చేసుకుంటున్నాను. ఈ వయసులో ముక్తికోసం నేను ఏమిచేయగలనో సలహా ఇవ్వండి?
(పి.రాజేశ్వరమూర్తి, మచిలీపట్నం)
ఈ వయసులో చేతనైనంత సేపు వివిధ రీతులలో భగవన్నామస్మరణం చేయటమే ఉత్తమ ముక్తిమార్గం. అయితే ఆ చేసేది నిష్కామ బుద్ధితో చేయాలనే మాట మరచిపోరాదు. ఈ అంశాన్ని గుర్తుంచుకొని మడి మైలలతో పనిలేకుండా, నిరంతర భగవన్నామస్మరణకై కృషిచేయమని మీకు నా మనవి.
* నేను రోజూ నిత్య పిత్రృతర్పణంలో కారుణ్య తర్పణాలు విడిచేటప్పుడు దత్తత వెళ్ళిన కొందరు బంధువులకు కూడా తర్పణాలు చేస్తున్నాను. మహాలయశ్రాద్ధంలోనూ, పుష్కరశ్రాద్ధంలోనూ గూడా, వారికి పిండప్రదానాలు చేస్తున్నాను. ఇది సరియైన విధానమేనా?
(కె.వేంకటసుబ్రహ్మణ్యం, నాగాయలంక)
ఇది పూర్తిగా శాస్ర్తియమైన విధానమే. కారుణ్య తర్పణాలకూ, కారుణ్య పిండాలకూ, ఎంత దూరపు బంధువులైనా పనికివస్తారు. కానీ ఇవి ఐచ్ఛిక విధానాలు.
*ఇచ్చి పుచ్చుకోవటానికి ఎడమ చేయి పనికిరాదంటారు కదా! మరి కండువాను ఎడమ భుజంమీదనే ధరించాలని ఎందుకు అంటున్నారు.
(దత్తాత్రేయ, రామనగర్‌గుండు, హైదరాబాద్)
కండువా అనేది మన యజ్ఞోపవీతానికి సమాంతరంగా సాగుతుంది. అందువల్ల యజ్ఞోపవీతం లాగానే దాన్నికూడా ఎడమ భుజంనుంచి కుడి చేతి క్రిందుగా వల్లెవాటుగా వేసుకోవాలని ధర్మశాస్త్ర నిర్ణయం.

కుప్పా వేంకట కృష్ణమూర్తి