ధర్మసందేహాలు

దేహమా.. మనస్సా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఏటి సూతకంలో వున్నవారు పుష్కర శ్రార్థం పెట్టవచ్చునా? (దువ్వూరి లక్ష్మీనరసింహం, ముమ్మిడివరం)
ఏటి సూతకంలో వున్నవారు ఆ సూతకానికి సంబంధించిన మాసికాదులనూ, ప్రతి సంవత్సరం వచ్చే నిత్య ప్రత్యాబ్దికాలను తప్ప మిగిలిన శ్రాద్ధాలు ఆచరించరాదు.
* మనం నిద్రించేటప్పుడు ఎక్కడ వుంటాము?
(వాసుదేవరావు, శ్రీకాకుళం)
మీ ప్రశ్నలో మనము అనే పదం కీలకమైనది. మనము అంటే నేను అని కదా! నేనంటే దేహమా? మనస్సా? వీటికి మించిన ఆత్మా? వీటిలో దేహం నిద్రాసమయంలో ఇక్కడే పడి వుంటుంది మనస్సు స్వప్నరూపంలో నానాలోక సంచారాలు చేస్తుంది. నేను అనే పదానికి నిజమైన అర్థం ఆత్మే. అది దేశకాలాతీతమైనది. వేదాంత శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తేకానీ దీని తత్త్వం మనకు అంతుబట్టదు.
* అపర కర్మలలో చేసే ఆశీర్వచనము, శుభకార్యాలలోచేసే ఆశీర్వచనమూ వేరువేరుగా వుంటాయా?
(కె.మధుసూధనరావు, రాళ్ళపాలెం)
కొన్ని అంశాలు వేరుగాను, కొన్ని అంశాలు సమంగాను వుంటాయి. దీర్ఘాయుష్యమస్తు వంటి అంశాలు సమంగా వుంటాయి. పితృదేవతా ప్రసాద సిద్ధిరస్తు, దంపత్యోః ఆనుకూల్యమస్తు వంటివి వేరువేరుగా వుంటాయి. దీనినిబట్టే ఆయా సందర్భాలలో చెప్పే వేద మంత్రాలు కూడా వేరువేరుగా వుంటాయి.
* తెల్లజిల్లేడు కర్రతో వినాయకుడి విగ్రహం గాని, హనుమంతుడి విగ్రహంగాని చేయించి పూజలో పెట్టుకోవచ్చునా?
(ఆరాధి సుధాకరరావు, రామచంద్రాపురం)
ఆ విగ్రహంయొక్క పరిమాణం మన చేతి గుప్పెడుకంటే ఎక్కువగా లేకుండా వుంటే దానిని పూజలో పెట్టుకోవడం మంచిదే. పరిమాణం అంతకంటే ఎక్కువ వుంటే ఎవరైనా సిద్ధపురుషుల చేత ఆ విగ్రహానికి సంస్కారం చేయించి, వారి అనుమతితో దానిని ఇంట్లో పెట్టుకుని అర్చించవచ్చును
* పుష్కరాలలో గానీ, దగ్గర బంధువులు మరణించినప్పుడు గానీ, నదీ స్నానం చేయవచ్చునా?
(వి.రామలింగాచారి, యాదగిరిగుట్ట)
పుష్కరాలలో స్నానం చేయడానికి ఏ సందేహమూ లేదు. సన్నిహిత బంధువుల మరణ సందర్భంలో నదీ స్నానం చేయవచ్చుగానీ, చేసినంత మాత్రాన ఆశౌచశుద్ధి లభించదు. ఎన్నిరోజులు ఆశౌచం వుంటుందో ఆ తర్వాత స్నానంచేస్తేనే శుద్ధి. పుష్కరాలు జరుగుతుండగా మృతాశౌచం వస్తే, ఆ సమయంలో నదీ స్నానం వల్ల విశేష ఫలితమేమీ వుండదు.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి