ధర్మసందేహాలు

పిడుగులకు మంత్రమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆడపిల్లలు మాత్రమే వున్న దంపతులకు పున్నామ నరకం తప్పదా? - కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
దత్తత స్వీకారం ద్వారా దానిని తప్పించుకోవచ్చును.
* భరతుడు తనకు అంత్యక్రియలు చేయరాదని దశరథుడు ఆజ్ఞాపించాడనీ, అందుకే శత్రుఘు్నడు తండ్రి అంత్యక్రియలు చేశాడనీ కొందరు అంటున్నారు. ఇది నిజమేనా?
- నిర్మల, సూర్యాపేట
వాల్మీకి రామాయణంలో అలా లేదు. వాల్మీకి ప్రకారం భరతుడే తండ్రికి అంత్యక్రియలు చేశాడు.
* ఉరుములు, పిడుగులు, మెరుపులు వచ్చే సమయంలో ఏ మంత్రం జపించాలి? - డి.కోటేశ్వరరావు, అత్తిలి
అర్జునుడికి వీటిని నివారించే శక్తి ఇంద్ర వరంవల్ల లభించింది. అందువల్ల మీరు చెప్పిన సందర్భంలో ‘‘అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ హవ్యవాహనః భీభత్సో విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః’’ అనే ఈ మంత్రాన్ని జపించాలి.
* ఆంజనేయస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించవలసిన ప్రత్యేక శ్లోకం ఉందటగదా, అది ఏది?
- రామకృష్ణ, రామానుజపురం
దీనికి ప్రత్యేక శ్లోకం ఏదీ అవసరం లేదు. మీకు వచ్చిన ఆంజనేయ స్తోత్ర శ్లోకం ఏదైనా సరే దీనికి పనికివస్తుంది.
* సీత అయోనిజగా భూమాత గర్భంలో జన్మించడానికి కారణము ఏమిటి? - ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
వాల్మీకి రామాయణంలో దీన్ని గురించిన వివరణ ఏదీ లేదు. ఇతర రామాయణాల ప్రకారం తాపసి అయిన వేదవతి రావణాసురుడి మీద పగ తీర్చుకోవటం కోసం భూమి పుత్రికగా జన్మించింది.
* రావణాసురుడిలో మంచి లక్షణాలు వివరించండి?
రావణాసురుడిలో వేదశాస్త్ధ్య్రాయనము, తపశ్శక్తి, బంధుప్రీతి వంటి మంచి లక్షణాలు కూడా ఉన్నాయ.

కుప్పా వేంకట కృష్ణమూర్తి vedakavi@serveveda.org