ధర్మసందేహాలు

సీతారాములే ఆదర్శ దంపతులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*అహంకారానికీ, ఆత్మవంచనకీ భేదం ఏమిటి? - మోహనరావు, తాటిపాక
వేదాంత శాస్తప్రరంగా చూసుకుంటే నేను, నేను అనే స్ఫురణ పేరే అహంకారము. లౌకిక వ్యవహారంగా చూసుకుంటే, నేను గొప్పవాడిని అని గర్వంతో విర్రవీగడం పేరే అహంకారం. ఇక ఆత్మవంచన అంటే తప్పని తెలిసిన పనినే చేస్తూ, పైకి తను చేసేది తప్పుకాదని సమర్థించుకోవడం.
* యోగశాస్త్ర పితామహుడు పతంజలి ఏ కాలానికి చెందినవాడు?
కె.హెచ్.శివాజీ, హైదరాబాద్
సాంప్రదాయకుల ప్రకారం ఇతడు కలియుగానికి పూర్వుడు. ఆధునిక చరిత్రకారుల ప్రకారం ఇతడు బి.సికి ప్రారంభం ప్రాంతంవాడు.
* ఆదర్శ దంపతులుగా సీతారాములను పేర్కొంటారు. జగద్గురువుగా పేరు పొందిన శ్రీకృష్ణుని అలా భావించరు. ఎందుకని? - లక్ష్మి అన్నవరం
శ్రీహరి ఒక్కొక్క అవతారంలోను ఒక్కొక్క విశేషాన్ని ప్రదర్శించాడు. శ్రీరామావతారంలో ఏకపత్నీవ్రతాదులైన ఆదర్శాలను ప్రదర్శిస్తాడు. శ్రీకృష్ణావతారంలో బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానోదయం కలిగేటంతటి యోగలీలలను ప్రదర్శించాడు. అందువల్ల ఆయన జగదుర్గువుగా పేరు పొందాడు. ఈ రెండు లీలలూ ఒకే పరమాత్మవి అనే మాట మనం మరిచిపోకూడదు.
* వేదాన్ని శూద్రులు చదువవచ్చునా?పడాల బ్రహ్మానందం, నెల్లూరు జిల్లా
అనాది పరంపరంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం శూద్రులకు వేదపఠనాధికారం లేదు. ఇటీవలే ఆవిర్భవించిన ఆర్య సమాజంవారు మాత్రం దానిని అంగీకరించడం లేదు.
* సర్గ అనగానేమి? - ఒ.ఎస్.కె.మోహన్, విజయవాడ
రామాయణము, రఘు వంశము వంటి కావ్య గ్రంథాలలో వుండే విభాగాలను సర్గలు అని పిలుస్తారు.
* శివాలయంలోని నిర్మాల్య పుష్పాలను మనం ధరించవచ్చునా?
- రామారావు, సికిందరాబాదు
శివాలయంలోనే చండీశ్వరుడనే ఒక దేవత వుంటాడు. శివ నిర్మాల్యాన్ని ఆయనకు చూపించి మనం ధరించాలి.

-కుప్పా వేంకట కృష్ణమూర్తి