ధర్మసందేహాలు

పాపపుణ్యాలు అనుభవించేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భర్త పోయిన స్ర్తిలకు 12 రోజులలో కొన్ని విధానాలను హిందువులు పాటిస్తున్నారు. ఇలా పాటించాలని ధర్మశాస్త్రాలలో వుందా? - హైమావతి, నెల్లూరు
ధర్మశాస్త్రాల ప్రకారం భార్యకన్నా భర్త ముందరే పుడతాడు. అందువల్ల ఆ భర్త ఎక్కడ వున్నాడో తెలియకపోయినా, అతని సజీవత్వం ద్వారా స్ర్తికి కొన్ని అలంకారాలు సంక్రమిస్తాయి. భర్త మరణించిన తర్వాత ఆ అలంకారాలను తొలగించుకోవాలని ధర్మశాస్త్రాలు నిర్ద్వంద్వంగా చెపుతున్నాయి. వాటిని తొలగించేందుకు ఒక సానుభూతి పూర్వకమైన సౌమ్యప్రక్రియగా కొన్ని విధానాలు హిందూ కుటుంబాలలో రూపొందాయి.
* బ్రహ్మ మానస పుత్రులు ఎవరు? ఎ.పి.రాజయ్య, జగిత్యాల
సృష్టి ప్రారంభ దశలో స్ర్తి పురుష సృష్టికి ముందు బ్రహ్మదేవుడు కేవలం తన సంకల్ప బలంతో కొంతమంది జీవులను సృష్టి చేశాడు. వారందరూ బ్రహ్మమానస పుత్రులే. సనకసనందనాదులందరూ ఈ కోవలోనివారే.
* మరణానంతరం పాపపుణ్యాలు అనుభవించేది ఎవరు?
వేరే ఎవరో అనుభవించేటట్లయితే మనకెందుకు బాధ? ఎవడైతే ఇక్కడ పాపపుణ్యాలు చేస్తున్నాడో, చేసి మరణిస్తున్నాడో, వాడే మళ్లీ మరొకచోట, మరో దేహంతో జన్మించి తను చేసిన పాపపుణ్యాల ఫలితాలను అనుభవిస్తున్నాడు.
* ఊర్వశి జన్మ చరిత్ర ఏమిటి? నీరజ, అదిలాబాద్
పూర్వం నర నారాయణులు తపస్సు చేసుకుంటూ వుండగా వారిని మామూలు మహర్షులుగా భావించిన దేవేంద్రుడు వారిని పరీక్షించటం కోసం అందరు అప్సరసలను పంపించాడు. వారిని చూసి నారాయణ మహర్షి చిరునవ్వు నవ్వి తన తొడమీద సన్నగా గోళ్లతో గీశాడు. అప్పుడు ఆ ఊరుభాగం నుంచి ఒక దివ్య సుందరాంగి జన్మించింది. ఊరువులోంచి జన్మించటంవల్ల ఆమెకు ఊర్వశి అనే పేరు వచ్చింది. ఆమె సౌందర్యాన్ని చూసి, వచ్చిన దేవాంగనలు సిగ్గుపడి వెనక్కి వెళ్లిపోయారు. నారాయణ మహర్షి ఊర్వశిని దేవేంద్రుడికి కానుకగా పంపాడు.
*నారద మహర్షి యొక్క విశేషమేమిటి? - రాజు హైదరాబాద్
దీని సమాధానం ఒక గ్రంథమే అవుతుంది. ఈయన పూర్వజన్మలో ఒక దాసీ పుత్రుడు. ఆ జన్మలో కొందరు యతీశ్వరులకు చాతుర్మాస్య సమయంలో సేవ చేస్తూ వేదాంత చర్చలను విని అప్రయత్నంగానే పరమాత్మ జ్ఞానాన్ని పొందాడు. తత్ఫలితంగా అతడు పైజన్మలో బ్రహ్మ మానస పుత్రుడై నారదుడుగా జన్మించాడు.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి