ధర్మసందేహాలు

తెల్లజిల్లేడు ప్రాశస్త్యం తెలుసుకొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెల్ల జిల్లేడు ప్రాశస్త్యమేమి? -యమ్.యన్.సత్యనారాయణ
ఔషధపరంగా అది గొప్ప మూలిక. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే, దానిలో దేవతాశక్తులను ఆకర్షించే సుగుణం అధికంగా ఉంది. ఒక తెల్ల జిల్లేడు చెట్టు 12 సం.ల పైగా అవిచ్ఛిన్నంగా పెరిగితే దాని తల్లివేరు గణపతి ఆకారంగా గానీ, ఆంజనేయ ఆకారంగా గానీ దానంతట అది గానే రూపొందుతుంది. దాన్ని శాస్త్రోక్త విధానంగా ఆరాధన చేస్తే ఆయా దేవతల అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. తెల్లజిల్లేడు సూర్య భగవానుడికి గూడా ప్రియమైనదే.
* ఉదయం లేచిన వెంటనే దేవుని ముఖం చూడాలా? తల్లిదండ్రుల ముఖం చూడాలా? ప్రకృతి అందం చూడాలా? (ఎన్.సురేంద్ర, కొత్తగాజువాక)
- ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేవగానే దైవస్మరణ చేస్తూ తనరెండు అరచేతులను చూసుకోమనే వుంది.దైవ స్మరణ చెప్పారు కనుక ఇప్పటి కాలంలో దేవుడి పటాలు పెరిగాయి కనుక దేవుడి ముఖం చూస్తూ నిద్రలేవడం కూడా మంచిదే.
* కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం కీడు జరిగే అవకాశం ఉందా? - గాజులమ్మ, నెల్లూరు
వివాహాదులకు వ్యవస్థను ఏర్పరచడానికే చతుర్వర్ణ వ్యవస్థ వగైరాలు ఏర్పడినాయి. వాటిలోంచి వృత్తి ప్రధానంగా కుల వ్యవస్థ రూపుదిద్దుకుంది. కనుక ఆ నియమాలను అతిక్రమించడం ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించడమే అవుతుంది. కీడు తప్పదు కదా!
* మొలత్రాడు హిందువులే ఎందుకు కట్టుకుంటారు? అని ఇంగ్లాండులోని మా మనవడు అడుగుతున్నాడు.
- యమ్.యన్.సత్యనారాయణ
హిందూ మహర్షులకు శరీరంలోని 72వేల నాడుల ప్రకంపనలు, వాటిలో ప్రాణశక్తి ప్రవహించే విధానాలు బాగా తెలుసు. ఆ ప్రకంపనలు స్ర్తిలలోనూ పురుషులలోనూ ఒకే రీతిగా వుండవు. పురుషులలోని నాడీ ప్రకంపనలలోగల కొన్ని వ్యతిరేక గుణాలను తొలగించేందుకు కటిసూత్రం (మొలత్రాడు) ఉపయోగపడుతుందని మన మహర్షులు గుర్తించారు. అందుకే హిందూ పురుషులకు మొలత్రాడు అవశ్య విధిగా ఏర్పాటుచేయబడింది.
*ఇంట్లో మగవారు పూజ చేస్తే కుటుంబం మొత్తానికి పుణ్యం వస్తుందని, ఆడవారు చేస్తే చేసిన వారికి మాత్రమే పుణ్యం వస్తుందనీ అనటంలో ఎంత నిజముంది? - రత్నం రాజు, సూర్యాపేట
భార్యభర్త అనే పవిత్ర వ్యవస్థలో భర్త చేసే పనులకు పరిపూర్ణ సహకారం అందించడం భార్యపని. అతనుచేసే పూజాది పుణ్యకార్యాలల్లో కూడా ఇది నియమం వర్తిస్తుంది. కనుక భర్త చేసే పుణ్యంలో సగభాగం భార్యకు అందుతుందని ధర్మశాస్త్రాలు నిర్ణయించాయి. భార్య చేసుకొనే పుణ్యం వల్ల కేవలం ఆమెకే పుణ్యము వస్తుంది కాని ఆమె సంకల్పం వల్ల అందరికీ కూడా వచ్చేట్టు చేసే శక్తి ఆమె సంకల్పం లోనే ఉంటుంది.
*కలియుగ వేంకటేశ్వరున అప్పుతీరేదెన్నడు? రామారావు, ఆత్మకూరు
కలియుగాంతానికి వెంకన్న అప్పు తీరిపోతుంది .

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org