ధర్మసందేహాలు

మనస్తాపం ఎందుకు కలుగుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖ అనేక కుటుంబాలల్లో పెద్దలు సద్వర్తనులే అయినా పిల్లలు వారి బాటలోనడవకుండా మనస్తాపం కలిగిస్తున్నారు దానికికారణమేమి?
పి.వి. నరసింహారావు, రాజమండ్రి
చిన్నవయసులో చెప్పవలసిన మంచిమాటలు చెప్పకుంటా మంచి అలవాట్లు చేయించకుండా ఊరుకొని కేవలం చదువు మాత్రమే పిల్లలకు నేర్పిస్తూ మన దేశాన్ని గురించి కాని, మన సంప్రదాయాల గురించి రవ్వంత కూడా తెలియకుండా పెంచి చివరకు వాళ్లు స్వతంత్రులయ్యాన నా మాట వినాల్సిందే అని పెద్దవాళ్లు పట్టుపడితే ఫలితం ఉండదు. పిల్లలకు సరియైన వయసులో సరియైన బోధ చేయని పాపమే పెద్దవారికి వారు కలిగించే మనస్తాపం.
ఖ వివాహ సమయంలో వధూవరరుల చేత ఒకే కొబ్బరి బోండానికి రెండు స్ట్రాలు తగిలించి నీళ్లు తాగిస్తున్నారు. ఇది శాస్తప్రరిధిలో ఉందా?
నరహరి, నెల్లూరు
వివాహదీక్షా సమయంలో వధూవరులిద్దరికీ ఒకే విస్తరిలో భోజనాలు పెట్టిస్తున్నారు కదా. ఇదీ అలాంటిదే. వివాహదీక్షా దినాలల్లో వధూవరులకు కొన్ని మినహాయింపులున్నాయని పెద్దలు ఆచరణ పూర్వకంగా చెబుతున్నారు.
ఖ 27 నక్షత్రాల పాదాలు 108 వస్తాయి కనుక ఈ పాదాలను విష్ణు సహస్రనామాలకు వరుస సంఖ్యలో జతచేసి ఏ నక్షత్ర పాదం వారు ఆనామాన్ని జపించుకోవడం జాతక రీత్యా శ్రేయస్కరమని చెప్పే విషయానికి ఆధారం ఏదైనా ఉందా?
నరసయ్య, నకిరేకల్లు
నాకు తెలిసినంతలో లేదు. అలా చెప్పేవారికి ఏమైనా శాస్త్ర వాక్యాలు కనిపించాయేమో కనుక్కోండి.
ఖ కొన్ని దేవాలయాల్లో హారతి సమయంలో తప్పించి మిగిలిన సమయంలో గంట కొట్టనివ్వడం లేదు. ఇది సబబేనా?
తిరుపతి, కాశీ, రామేశ్వరం వంటి క్షేథ్రాల్లో భక్తులకు గంట కొట్టే అవకాశమే ఉండదు కదా. అలాగే ఆలయంలో జరిగే ఇతర నామసంకీర్తన , జప , పూజాది కార్యక్రమాలకు భంగం జరిగేటట్లు వుంటే భక్తుల ఘంటానాదాన్ని ఆపించడంలో దోషం ఏమీ కనిపించడం లేదు.
ఖ మన్యుసూక్త హోమమనే ప్రక్రియ నిజానికి ఉన్నదా?
శాస్ర్తీ, వరంగల్లు
నిస్సందేహంగా ఉన్నది
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035. vedakavi@serveveda.org

- కుఫ్పా వేంకట కృష్ణమూర్తి