ధర్మసందేహాలు

శరణాగతి పొందాలంటే ఏం చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వికర్ణుడు పాండవ కౌరవులందరిలోనూ ధర్మపరాయణుడని విన్నాను. అంతటి వాడికి తగినంత గుర్తింపురాలేదేమి?
- కె.యల్.శివాజీరావు, హైద్రాబాదు
వికర్ణుడు గాంధారీ పుత్రులలో 18వ వాడు. ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో నిర్భయంగా ధర్మపరిశీలన చేసి, దుర్యోధనాదులు చేసేది తప్పని సభలో ఎలుగెత్తిచాటాడు. అంతవరకు అతను ఘనుడే. కానీ అంతకుముందు గానీ, ఆ తరువాతగానీ, విభీషణుడి లాగా తన వ్యక్తిత్వాన్ని స్వతంత్రంగా నిలబెట్టుకోలేకపోయాడు. గుర్తింపుగూడా దానికి తగ్గట్టే అతనికి దక్కింది. మహాభారత యుద్ధంలో ఇతనిని చంపవలసి వచ్చినందుకు భీముడు బోరున విలపిస్తూ చంపాడని మాత్రం భారతంలో వుంది.
* సర్వస్యశరణాగతి పొందాలంటే ఏమి చేయాలి? - ఎమ్.రాజు. హుజూరాబాద్
మనకు ఏ భగవంతుడండే ఇష్టమో అదే రూపాన్ని గాని, అదే తత్త్వాన్నిగానీ నిరంతరం స్మరిస్తూ మనం చేసే సకల కర్మల ఫలాన్నీ ఆ స్వామికే సమర్పిస్తూ మనకు కష్టనష్టాలు వచ్చినా, సుఖసంతోషాలు కలిగినా అవి రెండూ ఆ స్వామి ప్రసాదాలే అని సమబుద్ధితో స్వీకరిస్తూ ఆ స్వామి స్మరణను మరచిపోకుండా సర్వుల్లోను ఆ స్వామి అంశను చూస్తూ ఉండడమే సర్వస్యశరణాగతి.
* స్ర్తిలు శుక్రవారం తలస్నానం చేయవచ్చా? ఎ. అలేఖ్య హైదరాబాదు
సువాసినీ స్ర్తిలు, కన్యకలు కానీ వట్టి తలస్నానం ఎప్పుడూ చేయరాదు. వారు ఎప్పుడు చేసినా అభ్యంగన స్నానమే తలంటు స్నానమే చేయాలి అది శుక్రవారం చేస్తే ఇంకా ప్రశస్తం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org