చిత్తూరు

అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాలు తొలగిస్తే భారీ ఎత్తున ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, డిసెంబర్ 25: చిత్తూరు జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలను విజయవాడ కార్యక్రమంలో పాల్గొని ధర్నా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులను తొలగించాలని మెమోలు జారీచేయడం చాలా దారుణమని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు సేవలు చేస్తూ చాలిచాలని జీతాలతో జీవనం గడుపుతున్నారని, తమ డిమాండ్లు నెరవేర్చాలని విజయవాడలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పోలీసులచే చిత్రహింసలు పెట్టడం దారుణమన్నారు. శుక్రవారం పీలేరులో అంగన్‌వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తల సంఘ అధ్యక్షురాలు చిన్నమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలను తొలగింపు జిఓ కాపీలను పీలేరులో దగ్ధంచేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు పెంచిన జీతాలు, పెంచిన జీతాల జివోను వెంటనే విడుదల చేయాలని, రావలసిన జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి కెవి పల్లి జడ్పిటిసి జయరామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బంది పట్ల చిన్నచూపు చూడటం తగదన్నారు. పీలేరు మండల కో- ఆప్షన్ మెంబర్ హబీబ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలే బుద్ధిచెబుతారని ఆయన ఎద్దేవాచేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడం దారుణమని , కనీసం మహిళలని కూడా చూడకుండా అరెస్టులు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలకు వై ఎస్‌ఆర్‌సిపి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు అలివేలు, రోజా, శ్రీదేవి, లలిత, మంజుల, పీలేరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

ఆలయం ముందు మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
తిరుమల, డిసెంబర్ 25 : రాష్ట్ర పతి రావడానికి 45 నిమిషాల ముందు ఓ మతిస్థిమితం లేని వ్యక్తి బేడి ఆంజనేయస్వామి ఆలయం ముందు ఉన్న విశాలమైన స్థలంలో హల్ చల్ చేశాడు. దీంతో భక్తులు హడలెత్తిపోయారు. కొంత సమయం పోలీసులు అతన్ని పట్టించుకోకపోయినా రాష్టప్రతి ఆలయానికి వచ్చే సమయం దగ్గర పడడంతో అతన్ని పట్టుకొని తీసుకెళ్లారు.