క్రీడాభూమి

ధోనికి నాన్‌బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి అనంతపురం కోర్టు నాన్‌బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2013లో బిజినెస్ టుడే మ్యాగజైన్‌లో విష్ణుమూర్తి అవతారంలో ధోని పాదరక్షలు పట్టుకున్న చిత్రం ప్రచురితమైంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కోర్టుకు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసినా ధోని కనీసం విచారణకు లాయర్‌ను కూడా ఏర్పాటుచేసుకోలేదు. దీంతో జుడీషీయల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు తీవ్రంగా పరిగణించి వచ్చేనెల 25వ తేదీలోగా హాజరుకావాలని లేకపోతే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.