క్రీడాభూమి

ధోనీ ఖాతాలో మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే: వన్డేల్లో అత్యధిక మందిని ఔట్‌ చేసిన నాలుగో వికెట్‌ కీపర్‌గా భారత వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. హరారేలో జింబాబ్వేతో బుధవారం జరిగిన వన్డేలో బుమ్రా బౌలింగ్‌లో చిగుంబర క్యాచ్‌ పట్టడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లాడిన ధోని 274 ఇన్నింగ్స్‌ల్లో 350 మందిని ఔట్‌ చేశాడు. శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర 482 మందిని ఔట్‌ చేసి జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియాకు చెందిన గిల్‌క్రిస్ట్‌(472), దక్షిణాఫ్రికాకు చెందిన బౌచర్‌ (424) వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు.