రాష్ట్రీయం

ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభం 72 రకాల పరీక్షల గుర్తింపు ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు బాధ్యతలు

హైదరాబాద్, డిసెంబర్ 12: ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో 72 రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సేవలను రోగులకు ఉచితంగా అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 19 రకాల వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు ఉన్నాయి. అదనంగా 53 రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఇందులో బ్లడ్, లిపిడ్ ప్రొఫైల్, క్లినికల్ పాథాలజీ, మైక్రో బయాలజీ సేవలు ఉన్నాయి. ఈ సేవలను పేదలకు అందించేందుకు ప్రైవేట్ సర్వీసు ప్రొవైడర్లను ప్రభుత్వం గుర్తించింది. జనవరి 15 నుంచి రాష్ట్రంలోని 192 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, జనవరి 31 నుంచి 1075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలను అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవల వ్యవస్ధను బలోపేతం చేయడంలో భాగంగా 72 రకాల డయాగ్నస్టిక్ సేవలను ఉచితంగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ రంగంలో ఈ పరీక్షలను చేయించుకునేందుకు రోగులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్య కేంద్రాలకు ప్రైవేట్ సర్వీసు ప్రొవైడర్ల సిబ్బంది వెళ్లి రోగుల నుంచి శాంపిల్స్ సేకరించి వారికి నిర్ణీత కాలపరిమితి లోపల వైద్య పరీక్షల నివేదికలను అందిస్తారు. జనవరి 1వ తేదీ నుంచి టెలి రేడియాలజీ సేవల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. రేడియాలజిస్టులు తక్కువగా ఉండడం వల్ల 113 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను రేడియాలజిస్టు కేంద్రాలతో అనుసంధానం చేసి, ఇమేజి డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా నివేదికలను పంపుతారు. డిజిటల్ సిగ్నేచర్‌తో రేడియాలజిస్టులు వైద్య నివేదికలను అందిస్తారు. సిటి స్కాన్ సదుపాయాన్ని టెక్కలిలో ఏర్పాటు చేయనున్నారు. పిపిపి పద్ధతిలో ఈ వ్యవస్ధను నిర్వహిస్తారు. మొత్తం వైద పరీక్షల పరికరాల వ్యవస్ధకు రూ.500 కోట్లు ఖర్చయింది. వీటి నిర్వహణ బాధ్యతను 70 మంది బయోమెడికల్ ఇంజనీర్లకు అప్పగించారు. ఈ పరికరాల పనితీరును జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. విజయవాడలో కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. తిరుపతి, విశాఖపట్నంలో జోనల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వైద్య పరికరాలకు సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇక్కడి నుంచి సిబ్బంది వెళ్లి మరమ్మత్తులు చేస్తారు.