మెయిన్ ఫీచర్

అవగాహనే అస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాన్సర్ అనే శత్రువుతో యుద్ధం చేసి విజయాన్ని సాధించే స్థాయికి ఆధునిక వైద్యం అభివృద్ధిసాధించింది. ఇంకా ఈ వ్యాధిపై అనేక అనుమానాలు మన మదిలో మెదులుతూనే ఉన్నాయి. క్యాన్సర్ ఆనవాళ్లను తొలిదశలోనే గుర్తిస్తే మట్టుబెట్టటం సులువు అని వైద్య నిపుణులు చెబుతున్నా ప్రాణాంతక వ్యాధిగానే పరిగణిస్తూ ఆందోళన చెందుతున్నాం. సరైన చికిత్సా విధానాలు లేనపుడు క్యాన్సర్ అంటే ప్రాణాంతక వ్యాధి అని అనుకునేవాళ్లం. సర్జరీ, రేడియోషన్, కిమోథెరిపీ వంటి అత్యాధునికి చికిత్సా పద్ధతులు వల్ల శరీరంలో దీని ఆనవాళ్లను సైతం లేకుండా తుదిముట్టించే స్థాయికి వైద్య సదుపాయాలు విస్తరించాయి. ఆధునిక జీవనశైలి క్యాన్సర్ ముప్పును ఎన్నోరెట్లు పెంచుతుంది. ముఖ్యంగా మనదేశం మహిళలే క్యాన్సర్ బారిన పడుతున్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
మనదేశంలోనూ, చైనాలోనూ రొమ్ము క్యాన్సర్ బాధితులు అధిక సంఖ్యలో నమోదవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి ఎనిమిది లక్షల మంది మహిళలు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2030నాటికి ఏడాదికి 3.2 మిలియన్ల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఇటీవల జరిపిన సర్వేల్లో వెల్లడైంది. మనదేశంలో మోనోపాజ్ దశ దాటకముందే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వస్తున్నట్లు గుర్తించారు. లక్షకు 102 కొత్త కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు. పల్లెల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు లక్షకు 8మాత్రమే కనబడుతుంటే పట్టణాల్లో లక్షకు 27మంది దీని బారిన పడుతున్నారు. కారణం మహిళలు ఉద్యోగాల కోసం వెళుతూ.. క్యాన్సర్‌ను ముదిరిన దశలో గుర్తించటమే. ఒకప్పుడు సంతానం లేని మహిళలకు, మోనోపాజ్ తరువాత బరువు ఎక్కువగా పెరిగే మహిళల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉండేది. కాని నేడు గర్భాశయ క్యాన్సర్ గతంలో కంటే 25శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, దీనిపై ముందు జాగ్రత్తలు తీసుకోపోతే మహిళల మనుగడకు ముప్పేనని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యాన్సర్ బారిన పడిన మహిళల్లో రెండువంతుల మంది మరణానికి చేరువ అవుతున్నారు. దీనికి కారణం అవగాహన లోపమే. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించి నయం చేయటం తేలి క. దీనివల్ల ఆయుర్దాయం పెరుగుతోంది. ఇప్పటికీ 70శాతానికి పైగా క్యాన్సర్ బాధితులు వ్యాధి బాగా ముదిరిన తరువాతే వైద్యానికి వస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నదని తెలిస్తే మరింత ముం దు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముందస్తు లక్షణాలపై అవగాహన పెంచుకుని చక్కటి జీవనశైలి అవలంభిస్తే క్యాన్సర్ బారిన పడకుండా బయటపడగలం. ఆరోగ్యం పూర్తి గా దెబ్బతిన్న తరువాత, బరువు తగ్గిపోయిన తర్వాత కాదు. తొలిదశలోనే క్యాన్సర్‌ను పట్టుకుంటే సమర్థంగా చికిత్స చేసి జీవితాలను నిలబెట్టగలగటం సులువు.