జాతీయ వార్తలు

కాంగ్రెస్ ఒంటరి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పార్టీతో పొత్తులుండవు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై దిగ్విజయ్ సింగ్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబర్ 30: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎవ్వరితో పొత్తు పెట్టుకోదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ సోమవారం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నాయకుడు కె.జానారెడ్డి, విధాన మండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు షబ్బీర్ అలీతో ఏఐసిసి కార్యాలయంలో సమావేశమై స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీల ఎన్నిక, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయటం, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించారు. దిగ్విజయ్ సింగ్ సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఇక మీదట ఎంఐఎంతో పొత్తు పెట్టుకోదని ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్‌తో పలు అంశాలపై చర్చలు జరిగాయంటూ తాము హైదరాబాదుకు వెళ్లిన అనంతరం కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల నుండి విధాన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
నల్గొండ కోసం పోటీ
నల్గొండ స్థానిక సంస్థల నుండి విధాన మండలికి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసేందుకు మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన అనిల్‌కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరువురు అభ్యర్థులు సోమవారం ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధినాయకులను కలుసుకుని తమ వాదన వినిపిస్తున్నారు. వారు దిగ్విజయ్ సింగ్‌ను విడి విడిగా కలిసి తమ వాదనలు వినిపించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరికొందరు అనిల్‌కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తుంటే, సిఎల్‌పి నాయకుడు కె.జానారెడ్డి, స్థానిక లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బలపరుస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లాలో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన పలువురు ఎంపిటిసి, జడ్‌పిటిసి తదితర సభ్యులు ఇతర పార్టీలకు వలస పోకుండా చూసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేసినట్లు జిల్లా నాయకులు చెబుతున్నారు. అందుకే అతనికి పార్టీ టికెట్ ఇస్తే సునాయాసంగా విజయం సాధిస్తారని వారు వాదిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి బదులు అనిల్‌కుమార్ రెడ్డిని రంగంలోకి దించితే వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోర పరిస్థితి ఎదురవుతుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. అనిల్‌కుమార్ రెడ్డితో పోలిస్తే రాజగోపాల్ రెడ్డి ఎంతో మెరుగైన అభ్యర్థి అని వారు చెబుతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్ ఇవ్వటం మంచిదని జిల్లాకు చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.