హైదరాబాద్

టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మజ్లిస్‌కు ఓటు వేసినట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మజ్లిస్‌కు ఓటు వేసినట్టేనని మాజీ డిజిపి, బిజెపి నేత వి దినేష్‌రెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, దళిత మోర్చ నేత రాములుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్‌కు మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటైందని, ఈ కమిటీ ప్రజలకు ఉపయుక్తమైన ఆలోచనలు చేస్తోందని అన్నారు. ఏ పాయింట్స్ అయితే మేలైన స్థితిగతులను కల్పిస్తాయో పరిశీలించడంతో మ్యానిఫెస్టో రూపొందించాం అని వెల్లడించారు.
స్వప్రయోజనాలకు పనిచేస్తోందే తప్ప ముస్లిం ప్రాతినిధ్య పార్టీ మజ్లిస్ కాదని దినేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మజ్లిస్-టిఆర్‌ఎస్ కలిస్తే హైదరాబాద్‌కు తీరని అన్యాయం చేసినట్టు అవుతుందని అన్నారు. మూసీ నది గురించి ఎవరూ ఇంతకాలం పట్టించుకోలేదని, బిజెపి అధికారంలోకి వస్తే మూసీ నది ప్రక్షాళనకు వీలుకలుగుతుందని చెప్పారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి అనేక సూచనలు చేశామని, కేంద్రప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఐదేళ్ల కాలంలో ఎవరు అధికారంలో ఉన్నారో గమనిస్తున్నాం. మజ్లిస్ వారితో మిలాఖత్ అయి స్వప్రయోజనాలకు రూలింగ్ పార్టీతో అలియన్స్‌పెట్టుకుంటూ మతసామరస్యానికి వ్యతిరేకంగా ముందుకు పోతున్నారు. హైదరాబాద్ పరిస్థితులు మెరుగుపడలేదు. రౌడీయిజం, మతసామరస్యానికి పోట్లుపొడుస్తున్నాయి. మజ్లిస్‌ను ఏ మాత్రం గెలిపించరాదు. రూలింగ్ పార్టీ అలయన్స్‌తో అరాజకాలు సృష్టించడమే తప్ప వారి వల్ల హైదరాబాద్ ప్రజలకు ఏ మాత్రం మేలు జరగలేదు. కనుక మజ్లిస్‌తో కలిసి పనిచేసే వారిని కూడా రానున్న గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు దూరంగా ఉంచాలి. టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మజ్లిస్‌కు ఓటు వేసినట్టు అవుతుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే సంవత్సరం క్రితమే క్రిష్ణా మూడోదశ, గోదావరి తొలి దశ నీళ్లు వచ్చేవని కాని సగం నీళ్లకే పరిమితం చేస్తున్నారని, మిగిలిన నీటిని మిగిలిన ప్రాంతాలకు తరలించాలని చూస్తున్నారని హైదరాబాద్ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని డాక్టర్ మల్లారెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ అభివృద్ధిపై ఎలాంటి విజన్ లేదని అన్నారు.