జాతీయ వార్తలు

ఈ దౌత్యం నిరంతరం సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-పాక్ సంబంధాలపై సిపిఎం నేత ఏచూరి

కోల్‌కతా, డిసెంబర్ 26: భారత్-పాకిస్తాన్ సంబంధాలు ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల ‘విఐపి దౌత్యం’ను దాటి ముందుకెళ్లాలని, ప్రజల మధ్య సంబంధాలవరకు వాటిని తీసుకెళ్లాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శనివారం చెప్పారు. ‘పాకిస్తాన్‌తో చర్చలు కొనసాగాలనే సిపిఎం ఎప్పుడూ చెప్తోంది. కార్యదర్శి స్థాయి చర్చలను మనం భగ్నం చేసాం. కేవలం ఉగ్రవాదంపైనే మాట్లాడతామని మరే అంశంపైనా మాట్లాడమని చెప్పడంతో అవి భగ్నమయ్యాయి. ఇప్పుడేమో జమ్మూ, కాశ్మీర్ సహా అన్ని అంశాలపైనా చర్చించడానికి అంగీకరించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ప్రధాని మోదీ హటాత్తుగా పాక్‌లో ఆగడం మంచిదే. అయితే చర్చలు నిలకడగా సాగాలి’ అని ఏచూరి అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి హటాత్తుగా లాహోర్‌లో ఆగిన నేపథ్యంలో ఏచూరి ఈ వ్యాఖ్యలు చేసారు. ‘్భరత్‌లో గులాం అలీ పాడడానికి మనం ఒప్పుకోలేదు. అలాగే పాక్ క్రికెట్ జట్లు భారత్‌లో ఆడడానికి మనం అంగీకరించలేదు. దేశ విభజన కారణంగా విడిపోయిన మన కుటుంబాలు ఒకరినొకరు కలుసుకోవడానికి మనం అంగీకరించలేదు. ఈ విఐపి దౌత్యం ఇక్కడే ముగియకూడదు. ప్రజల మధ్య సంబంధాలదాకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి’ అని ఏచూరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హటాత్తుగా లాహోర్ సందర్శించడాన్ని సిపిఎం స్వాగతించడమే కాకుండా, ఇరుదేశాల మధ్య శాశ్వత శాంతికోసం పాకిస్తాన్‌తో నిరంతరంగా క్రమం తప్పకుండా చర్చలు జరపాలని పిలుపునిచ్చింది.