కృష్ణ

కేంద్రంపై ఒత్తిడికి తాత్సారమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ రెండు బడ్జెట్లలోనూ ఎపికి తీరని అన్యాయం జరిగిందని ఈ విషయమై తెదే పార్టీ పొలిట్ బ్యూరోలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మీడియాకు లీక్‌లివ్వటమే గాని కేంద్రంపై బహిరంగంగా ఒత్తిడి తీసుకురావటానికి ఎందుకు వెనుకాడుతున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు స్పష్టం చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. పిసిసి, డిసిసి, నగర కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి ఇస్తుండగా జరిగిన బడ్జెట్ దిష్టిబొమ్మ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిసిసి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను సాధించుకోటానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిలు ముందుకు వచ్చినప్పటికీ తెదే పార్టీ ఎందుకు వెనుకాడుతున్నదో అర్థం కావటం లేదన్నారు. ఒకవైపు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 2018లోపు పూర్తి చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇటు చూస్తే కేంద్రం తన బడ్జెట్‌లో కేవలం వంద కోట్లు చూపిందని ఇక ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇదిలా వుంటే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రోగ్రెసివ్ బడ్జెట్ అంటూ చంకలు కొట్టుకుంటున్నారు. వ్యవసాయం విషయంలో స్వామినాధన్ కమిషన్ సిఫార్సులకు మాత్రం బడ్జెట్‌లో తావులేదన్నారు.

మరుగుదొడ్ల వినియోగంలో చైతన్యం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 1: జిల్లాలో 26 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు (ఒడిఎఫ్) (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్)గా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. సంపూర్ణ పారిశుద్ధ్యంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకునేలా చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లాలోని 26 గ్రామ పంచాయితీలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు (ఒడిఎఫ్) (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్)గా ప్రకటించిందని కలెక్టర్ తెలిపారు.
మండలాల వారీగా గ్రామ పంచాయితీల వివరాలు
బంటుమిల్లి మండలంలో పి.రావిగుంట, బాపులపాడులో పెరికీడు, రంగయ్య అప్పారావుపేట, సీతారాంపురం (ఎ), సీతారాంపురం (కె), గుడ్లవల్లేరు మండలంలో గాదెపూడి, గూడూరు మండలంలో కప్పలదొడ్డి, మచిలీపట్నంలో బొర్రపోతుపాలెం, కెపిటి పాలెం, తుమ్మలచెరువు, మండవల్లి మండలంలో మోకాశాకలవపూడి, మొవ్వ మండలంలో బార్లపూడి, కూచిపూడి, ముదినేపల్లిలో కోమర్రు, నందిగామ మండలంలో కొణతాత్మకూరు, తొర్రగుడిపాడు, నందివాడ మండలంలో గండేపూడి, పామర్రు మండలంలో కొమ్మరవోలు, పెడన మండలంలో ముచ్చర్ల, నేలకొండపల్లి, పెనమలూరు మండలంలో చోడవరం, పోరంకి, తాడిగడప, ఉంగుటూరు మండలంలో బొకినాల, చాగంటిపాడు, చికినాల. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జూన్ 30వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంబంధిత గ్రామ పంచాయతీల్లో నూరు శాతం వ్యక్తగత మరుగుదొడ్లు నిర్మాణాన్ని పూర్తి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోది, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో పలు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామన్నారు.

ఎసిబి వలలో
అవినీతి తిమింగలాలు!
* మచిలీపట్నం సిటిఓ కార్యాలయంలో ఎసిబి ట్రాప్
* పట్టుబడ్డ అసిస్టెంట్ సిటిఓ, సీనియర్ అసిస్టెంట్
* ఎసి మెకానిక్ నుండి రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 1: మచిలీపట్నం కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారుల తనిఖీలు కలకలం రేపాయి. రెండు అవినీతి తిమింగలాలను ఎసిబి అధికారులు వల చేసి పట్టుకున్నారు. రూ.15వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జలీలుద్దీన్ అలీఖాన్, సీనియర్ అసిస్టెంట్ బిఎస్ ప్రసాద్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్థానిక జిల్లా కోర్టు సెంటరులోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో టి ఏడుకొండలు అనే వ్యక్తి చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకుని ఫ్రిజ్‌లు, ఎసిలు మరమ్మతులు చేసుకుంటున్నాడు. దీన్ని గమనించిన అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ అలీఖాన్ ఇటీవలి కాలంలో ఏడుకొండలును కలిసి ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా వ్యాపారం చేసుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. చివరికి రూ.50వేలు విలువైన ఓ జనరల్ ఎసిలు ఇస్తే ఎలాంటి కేసు నమోదు చేయనని చెప్పాడు. దీంతో తాను అంత ఇచ్చుకోలేనని ఏడుకొండలు చెప్పటంతో రూ.35వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీనికి అంగీకరించిన ఏడుకొండలు ఆ తర్వాత ఎసిబి అధికారులను ఆశ్రయించి విషయాన్ని చెప్పాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఏడుకొండలు, తన షాపులోని ఎకౌంటెంట్ బసవ కలిసి సిటిఓ కార్యాలయానికి వెళ్లారు. అలీఖాన్‌కు రూ.15వేలు ఇచ్చారు. ఈ సొమ్ము తీసుకున్న అలీఖాన్ సరిచూడమని సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌కు ఇచ్చాడు. ప్రసాద్ రూ.15వేలు లెక్కపెట్టి మళ్లీ అలీఖాన్ చేతికి ఇచ్చాడు. అప్పటికే సిటిఓ కార్యాలయం వద్ద మాటువేసి ఉన్న ఎసిబి డిఎస్పీ గోపాలకృష్ణ తన సిబ్బందితో దాడి చేశారు. అలీఖాన్, ప్రసాద్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడిలో ఎసిబి సిఐలు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.