Others

డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైరెక్టర్.. మెత్తటి డిక్టేటర్

తొలి చిత్రం సంకీర్తనతోనే ప్రేక్షకులను, పరిశ్రమను ఆకర్షించిన దర్శకుడు గీతాకృష్ణ. తర్వాత కోకిల, ప్రియతమా లాంటి అనేక చిత్రాలతో దర్శకుడిగా ప్రస్థానం సాగించారు.

పెద్ద డైరెక్టర్‌తో చిన్న చిట్ చాట్

మీ నేపథ్యం?
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద మాధవరాయుడుపాలెం మాది. గుంటూరులో, మద్రాసులో చదువుసాగింది. కె విశ్వనాథ్ వద్ద సాగరసంగమం నుంచి స్వాతిముత్యం వరకూ చేశాను.
దర్శకుడవ్వాలన్న నిర్ణయం?
స్వతహాగా క్రియేటివ్ క్రీచర్‌ని. సంగీతం ఇష్టం. చిన్నప్పటినుండి ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచన ఉండేది. అలా దర్శకత్వం వైపు వచ్చాను.
తొలి అవకాశం?
కె విశ్వనాథ్ దగ్గర పనిచేసేటప్పుడే కొన్ని అవకాశాలు వచ్చాయి. అప్పట్లో కాదనుకున్నా. తర్వాత కోణార్క్ మూవీ మేకర్స్ పతాకంపై డాక్టర్ గంగయ్య తొలి అవకాశాన్ని సంకీర్తనకు ఇచ్చారు.
ఇష్టమైన జోనర్స్?
ప్రేమకథలు ఇష్టం. నిరూపించబడని రహస్య శోధనల కథలంటే చాలా ఇష్టం. దివ్యదృష్టి, అతీంద్రియశక్తులు లాంటి నిరూపించబడని కథాకథనాలు సినిమాలు తీయడం చాలా ఇష్టం. నేను తీసినవన్నీ దాదాపు వాటికి దగ్గరగానే వుంటాయి.
పరిశ్రమలో సమస్యలు?
మీరు చెప్పిన పలు సమస్యలన్నీ ఉన్నవే. అయితే ప్రతి దానికీ ఓ లాజిక్ ఉంది. చిన్న సినిమా నిర్మాతలు షేర్ పద్ధతిలో ప్రదర్శించమంటున్నారు. అలా చేస్తే థియేటర్ ఓనర్‌కి ఏమీ రాదు. ఎందుకంటే టికెట్స్ తెగవు కనుక. ఏదైనా సరే బ్రాండింగ్ ఉంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. అలా ఇటీవల ఓ చిన్న చిత్రాన్ని బ్రాండింగ్ చేసుకొని విజయవంతమయ్యారు. కోటి రూపాయలతో సినిమా తీస్తే కోటి రూపాయలు ప్రమోషన్‌కు ఉపయోగిస్తే కనీసం మూడు రోజులు కలక్షన్లు రాబట్టినా హిట్ అయినట్టే.
దర్శకుడంటే?
డిక్టేటర్, హిట్లర్‌లా ఉండి పూల కత్తులతో పనిచేయించుకోవాలి. 24 క్రాఫ్ట్స్‌లపై అవగాహన ఉండాలి. అలా ఉన్న దర్శకులు 10శాతమే. మిగతా వాళ్లంతా కాంట్రాక్టర్సే.

-శేఖర్