ఖమ్మం

ఆదివాసీలకు జిల్లా కౌన్సిల్ ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలోని మన్యప్రాంతాలలో ఆదివాసీలకు ప్రత్యేక స్వయంపాలనతో కూడిన జిల్లా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆదివాసీసంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జెఎసి) రాష్ట్ర చైర్మన్ చందా లింగయ్యదొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడెంలో జరిగిన ఆదివాసీ జెఎసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆదివాసీలకు స్వయం పాలన ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్, రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హామీలు ఇచ్చి మన్యం సీమ రాష్ట్ర ఉద్యమాన్ని శాంతింపచేశారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూతన జిల్లాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన దృష్ట్యా మన్యప్రాంతంలో ఉన్న ఐటిడిఎ కేంద్రాలను ఆదివాసీ జిల్లా కౌన్సిల్‌చట్టం అమలుచేస్తూ ఆదివాసీలకు స్వయంపాలన ప్రకటించాలని కోరారు. మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ప్రత్యేక ఐటిడిఎలను ఏర్పాటుచేయాలని, మన్యప్రాంత పరిధిలో ఉన్న ఖమ్మంజిల్లా భద్రాచలం, వరంగల్ జిల్లా ఏటూరి నాగరం, కరీంనగర్ మహదేవపూర్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటిడిఎ కేంద్రాలను, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట కేంద్రాలలో జిల్లా కౌన్సిల్ చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. మన్యప్రాంతంలోని వనరులను ఆదివాసీలకు దక్కేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి చేయాలని, మన్యప్రాంతంలో ఉన్న హక్కులను 1976లో కాపాడబడిన మైదాన గిరిజనులకు వర్తించకుండా చూడాలని కోరారు. సమావేశంలో ఆదివాసీసంఘాల జెఎసి జిల్లా అధ్యక్షులు వాసం రామకృష్ణదొర, డివిజన్ అధ్యక్షులు పాయం పోతయ్య, విద్యార్థిసంఘం జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు, తాటి రాంచందర్‌రావు, బాసబోయిన జంభు, కారం సీతారాములు, తాటి పుల్లయ్య, దొడ్డా శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా నాయకులు డాక్టర్ చందా సంతోష్, సోలం సురేష్ తదితరులు పాల్గొన్నారు.