రాష్ట్రీయం

విభజన సమస్యలు తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిష్కారానికి పట్టుబడుతున్న ఏపి, తెలంగాణ
నివేదికలతో సిద్ధమవుతున్న ఇరు రాష్ట్రాలు
26న ఢిల్లీలో భేటీ కానున్న కేంద్ర సబ్ కమిటీ
హైదరాబాద్, నవంబర్ 24: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం నియమించిన ఉన్నతాధికారుల ఉప కమిటీ ఢిల్లీలో 26వ తేదీ గురువారం సమావేశమవుతోంది. లోక్‌సభ సమావేశాలు మరో మూడు రోజుల్లో ప్రారంభమవుతుండగా, కేంద్రం విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ ప్రధానంగా హైకోర్టు విభజన, ఆర్టీసి విభజన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా ఉమ్మడిగా కొనసాగడం, కృష్ణా జలాల పంపిణీ, కొత్త ప్రాజెక్టులు, పోలీసు శాఖ విభజన తదితర అంశాలపై దృష్టి సారించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు నియమించిన కమల్‌నాథన్ కమిటీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. ఈ కమిటీ సిఫార్సులపై ప్రభుత్వ ఉద్యోగులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసి విభజన ఇప్పటికీ తేలలేదు. సాంకేతికంగా బస్‌భవన్‌లో ఏపిఎస్‌ఆర్టీసి, టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు వేరువేరు చాంబర్లు కేటాయించినా, అధికారికంగా విభజన జరగలేదు. షీలా బేడీ కమిటీ కాలపరిమితిని పొడిగించలేదు. దీంతో ఆర్టీసి విభజన ఇప్పట్లో తేలడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఆర్టీసి విభజన, హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. హైకోర్టుకు సంబంధించి ఆంధ్రాకు వేరుగా పరిపాలనా భవనం ఏర్పాటు చేసి ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కాని, విభజన అంటూ జరిగితే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆ భౌగోళిక ప్రాంతంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హైకోర్టు ఒక తీర్పులో స్పష్టం చేసింది. హైకోర్టు విభజన వల్ల తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరుగుతుందని నెలల తరబడి తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. ఈ వివరాలను 26వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.
విద్యుత్ కమిటీ సమావేశంలో ఏపికి చుక్కెదురు
కాగా విద్యుత్ వివాదాలపై తమ వైఖరులను విభజన ఉప కమిటీ భేటీలో ప్రముఖంగా ప్రస్తావించేందుకు ఏపి, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఏకపక్షంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి తమను అంధకారంలో తోసారని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కాకతీయ ప్రాజెక్టు, ఆదిలాబాద్ సింగరేణి థర్మల్ ప్రాజెక్టుల్లో తమకు వాటా ఇవ్వాలని ఏపి ప్రభుత్వం కోరనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాన్ని కేంద్ర విద్యుత్ అథారిటీ 23వ తేదీన ఢిల్లీలో సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో ఏపి ప్రభుత్వం అనుసరించిన వైఖరిని సిఇఏ తప్పుబట్టింది. వచ్చే పది రోజుల్లో మేజర్ సింగ్ ఆధ్వర్యంలోని సిఇఏ కమిటీ కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.