క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్ జొకొవిచ్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 17: ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకొవిచ్ దూకుడును కొనసాగిస్తున్నాడు. నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అతను ఫెలిసియానో లొపెజ్‌ను 6-3, 6-3 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరారు. మంచి ఫామ్‌లో ఉన్న అతను ఈసారి కూడా టైటిల్ గెల్చుకునే అవకాశాలున్నాయి. ఇతర మ్యాచ్‌ల్లో జోవిల్‌ఫ్రైడ్ సొంగా 6-3, 6-2 తేడాతో డొమినిక్ థియెమ్‌ను ఓడిస్తే, చాలాకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన రాఫెల్ నాదల్ 6-7, 6-0, 7-5 ఆధిక్యంతో అలెక్స్ జెరెవ్‌పై గెలిచాడు. కెయ్ నిషికోరి 6-7, 7-6, 7-6 స్కోరుతో జాన్ ఇస్నర్‌పై అతి కష్టం మీద విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. మారిన్ సిలిక్ 7-5, 5-7, 7-6 తేడా రిచర్డ్ గాస్క్వెట్‌పై గెలిచాడు. డేవిడ్ గాఫిన్ 6-3, 5-7, 7-6 తేడాతో స్టానిస్లాస్ వావ్రిన్కాను, మిలోస్ రవోనిక్ 6-4, 7-6 తేడాతో థామస్ బెర్డిచ్‌ను, గేల్ మోన్ఫిల్స్ 6-3, 6-4 స్కోరుతో ఫెడిసియానో డెల్బోనిస్‌ను ఓడించారు.
సెమీస్‌లో సెరెనా
ఇండియన్ వెల్స్: ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హాలెప్‌ను 6-4, 6-3 తేడాతో సునాయాసంగా ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ సెరెనా ఆధిపత్యం కొనసాగింది. టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి హాలెప్ ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సుమారు 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ టైటిల్ వేటను కొనసాగిస్తున్న సెరెనా తాను అద్భుతమైన ఫామ్‌లో ఉందని నిరూపించుకుంది. కాగా మరో మ్యాచ్‌లో అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-2, 7-6 ఆధిక్యంతో పెట్రా క్విటోవాపై విజయం సాధించి సెమీ ఫైనల్స్‌లో స్థానం సంపాదించింది. మరో క్వార్టర్ ఫైనల్‌లో మగ్దలీన రిబరికొవాను విక్టోరియా అజరెన్కా ఢీ కొంటుంది. చివరి క్వార్టర్ ఫైనల్ కరొలినా ప్లిస్కోవా, దరియా కసట్కినా మధ్య జరుగుతుంది.

చాంపియన్స్ లీగ్ క్వార్టర్స్‌కు బార్సిలోనా
బార్సిలోనా, మార్చి 17: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఆర్సెనెల్‌తో జరిగిన మ్యాచ్‌ని 3-1 తేడాతో ఓడించిన బార్సిలోనా మొత్తం 5-1 సగటుతో సునాయాసంగా క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. స్టార్ ఆటగాడు నేమార్ 18వ నిమిషంలోనే గోల్ చేసి బార్సిలోనా ఉత్సాహాన్ని పెంచాడు. ఈక్వెలైజర్ కోసం ఆర్సెనెల్ చేసిన ప్రయత్నాలను బార్సిలోనా అడ్డుకుంది. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం 51వ నిమిషంలో మహమ్మద్ ఎల్నెనీ ద్వారా ఆర్సెనెల్‌కు ఈక్వెలైజర్ లభించింది. ఈ గోల్ నమోదైన వెంటనే బార్సిలోనా ఆటగాళ్లు దాడులను ముమ్మరం చేశారు. లూయిస్ సౌరెజ్ 65వ నిమిషంలో గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలో నిలబెట్టాడు. మరో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ 88వ నిమిషంలో సాధించిన గోల్‌తో బార్సిలోనా 3-1 ఆధిక్యతను సంపాదించింది. ఇదే తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మరో మ్యాచ్‌లో బయెర్న్ మ్యూనిచ్ 4-2 గోల్స్ ఆధిక్యంతో జవెంటాస్‌పై గెలిచింది.