జాతీయ వార్తలు

పశువధ నిషేధంపై డిఎంకె నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 31: వధకోసం పశువు ల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డిఎంకె తీవ్రంగా మండిపడింది. ప్రధానమంత్రి కోరుకున్న వాటినే మనం తినాల్సిన పరిస్థితి తలెత్తిందని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై మరో ఉద్యమం వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ హెచ్చరించారు. మూడేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కేంద్రం ఇలాంటి నోటిషికేషన్లను జారీ చేస్తోందని ఆరోపించిన స్టాలిన్ ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి ఎందుకు వౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తర్వులకు నిరసనగా బుధవారం డిఎంకె చెన్నైలో భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ఈ రోజు జరిపిన నిరసన తొలి దశ మాత్రమేనని, నోటిఫికేషన్‌ను ఉపసంహరించని పక్షంలో మరిన్ని ఆందోళనలు తప్పవని కూడా స్టాలిన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సైతం తన మైనారిటీ విభాగం నేతృత్వంలో నగరంలో మరో నిరసన ప్రదర్శనను కూడా నిర్వహించింది.