సంజీవని

పక్క తడపకుండా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

==మీకు మీరే డాక్టర్==

ప్ర:మా బాబుకి పనె్నండేళ్లు వచ్చాయి. ఇంకా పక్క తడుపుతూనే వున్నాడు. మాన్పించాలంటే ఏం చేయాలి?
-వైదేహిరావు, నల్గొండ
జ: వౌలికంగా పక్క తడపటం అనేది వ్యాధి కాదు. కాబట్టి, సాధారణంగా దానికి మందులు వాడే అవసరం రాదు. అది నిద్రకు సంబంధించిన ఒక ఇబ్బందికర పరిస్థితి. అంతే! అయితే, బ్లాడర్ చిన్నదిగా వుండటం, షుగర్ వ్యాధి, మలబద్ధత, యాంటీ డయూరిటిక్ హార్మోన్ లోపం, స్కూల్లో విషయాలు కలిగించే మానసిక ఒత్తిడి, మూత్రంలో చీము, గొంతులో టాన్సిల్స్, ఎడినాయిడ్స్, నరాల వ్యాధుల్లాంటి కారణాలవలన సాధారణంగా పక్కతడపటం జరుగుతూ ఉంటుంది. ఇతర కారణాలేమీ లేనపుడు పిల్లల్లో ఇది సాధారణ విషయమేనని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇది పిల్లల ఎదుగల క్రమంలో ఏర్పడే ఒక పరిణామం మాత్రమే! వంశపారంపర్య కారణాలు కూడా ఉండొచ్చు. ఆడపిల్లల్లోకన్నా, మగ పిల్లల్లో రెండింతలు ఎక్కువగా వస్తుంది. ముడుచుపోయే తత్త్వం, చొరవ తగ్గిపోవడం, నలుగురితో కలివిడిగా ఉండలేకపోవటం, ప్రతిభా వ్యుత్పత్తులు ప్రదర్శించలేకపోవటం లాంటిలక్షణాలు పిల్లల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. పక్క తడుపుతున్నాడని బాబుని కేకలేయకండి. అది మొండితనానికి దారితీస్తుంది. కంగారు పడవద్దని ధైర్యం చెప్పండి. మానేయాలనే పట్టుదలని కలిగించండి. పక్క తడుపుతున్న సమయాన్ని గమనించి ఆ సమయానికి మోగేలాగా అలారం అమర్చండి. ముఖ్యంగా ఇది పిల్లల్లో అలసత్వం, మొద్దునిద్ర, మూత్రానికి లేవటానికి బద్ధకించటం లాంటి కారణాలవలన వస్తుంది. పిల్లల్ని మరింత ప్రేమగా చూడండి. వాళ్ళకు సోషల్ యాక్టివిటీని అలవాటు చేయండి. బలవంతంగా చదువులు రుద్దటం తగ్గించి శరీర వ్యాయామం కలిగించండి. పిల్లలు ఉత్తేజంగా ఉంటే బద్ధకం తగ్గి పక్క తడపటం ఆగుతుంది. సైకిల్ తొక్కించండి. తప్పనిసరి అయితే యాంటీ యారిటిక్ హార్మోన్ ఇప్పించండి. నువ్వులు బెల్లం మిశ్రమం పనిచేస్తుందని చెప్తారుగానీ, పెద్దగా దాని ప్రభావం కనిపించట్లేదు.
ఉసిరికాయ తొక్కు పచ్చడి (నల్ల పచ్చడి)లో సమానంగా పసుపు, ధనియాల పొడి మిశ్రమం కలిపి నెయ్యి వేసి రోజూ ఉదయం పూట మొదటి ముద్దగా తినిపించండి. రాత్రిపూట గారెలు గానీ, దిబ్బరొట్టెలుగానీ బాగా ఘనంగా ఉండే ఆహార పదార్థాలు పెట్టండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు లాంటివి ఇవ్వండి. రాత్రి భోజనాన్ని ఏడింటికే పెట్టండి. పాలు, మజ్జిగ, మంచినీళ్ళు, ఫ్రూట్ జ్యూస్‌ల్లాంటి ద్రవాహారం రాత్రిపూట ఇవ్వకండి. రాత్రి అన్నంలో పాలు పోసి తోడుపెట్టి ఉదయానే్న అది తినిపించండి. టిఫిన్లు పెట్టడం మానేయండి. చాలావరకూ మార్పు వస్తుంది.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com