ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో గ్రామ సింహాలపై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో 3.47 లక్షల కుక్కలు
విశాఖలో లక్షకు పైగా శునకాలు
మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడి

హైదరాబాద్, మార్చి 17: రాష్ట్రంలో మూడు లక్షల 47 వేల కుక్కలు ఉన్నట్టు మున్సిపల్ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఎమ్మెల్యే ఐసయ్య గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెపుతూ ఒక్క విశాఖ నగరంలోనే లక్షకు పైగా కుక్కలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఐసయ్య మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఇటీవల నాలుగు సంవత్సరాల పసికందును కుక్కలు పీక్కు తిన్న సంగతి ప్రభుత్వానికి తెలుసా? అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలో వీటి బెడద అధికంగా ఉందని అన్నారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ పట్టణాల్లో వీధి కుక్కల నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేశామని తెలియచేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖలో అతి ప్రతిష్టాత్మంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను నిర్వహించామని, ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారని, ఆ కార్యక్రమంలో వీధి కుక్కలు హల్‌చెల్ చేయడం బాధ కలిగించిందని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వివిధ పట్టణాలు, నగరాల్లో కుక్కలతోపాటు, పందుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయిందని అన్నారు. ఎమ్మెల్యే మోహనరెడ్డి మాట్లాడుతూ కర్నూలులో పందుల మాఫియా కొనసాగుతోందని అన్నారు. పందుల నిర్మూలనకు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సమాధానం చెపుతూ కుక్కలను చంపడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామని, కొన్ని చోట్ల కుక్కలను పట్టుకుని జంతు సంక్షేమ షల్టర్లకు తరలిస్తున్నామని తెలియచేశారు.ఇంకా ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ఆలూరు నియోజకవర్గంలోని ఎస్సీ, బిసి వసతి గృహాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే గుమ్మనూర్ జయరామ్ చేసిన అభ్యర్థనపై మంత్రి సానుకూలంగా స్పందించారు.