అంతర్జాతీయం

ట్రంప్‌కు చేదు అనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగోలో నిరసనలు.. ఎన్నికల ర్యాలీ రద్దు

చికాగో, మార్చి 12: అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయడానికి రిపబ్లికన్ పార్టీ నుంచి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌కు చికాగోలో చేదు అనుభవం ఎదురైంది. ఎరేనా ప్రాంతంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా వందలాది మంది ఆందోళన చేపట్టారు. ట్రంప్ విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ జనం నిరసన తెలిపారు. ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో ట్రంప్ ఎన్నికల ర్యాలీని రద్దుచేసుకోవాల్సి వచ్చింది. అమెరికాలో ఆందోళన వల్ల ఓ రాజకీయ పార్టీ ర్యాలీ రద్దుచేసుకోవడం అరుదు. అలాంటిది ట్రంప్ ర్యాలీ రద్దు చేసుకోవల్సి వచ్చింది. మొదట యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వద్ద ఆలస్యం అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. తరువాత ర్యాలీని వాయిదా వేస్తామని చెప్పారు. చివరికి భద్రతా కారణాల వల్ల ర్యాలీనే రద్దుచేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై ట్రంప్ ప్రత్యర్థులు టెడ్‌క్రుజ్, మార్కో రుబియో మాట్లాడుతూ ఇది అత్యంత విషాదమైన రోజు అన్నారు. ఆయన రాజకీయ ఉపన్యాసాలు విద్వేషపూరితంగా ఉండి, ఉద్రిక్తతలు రేపుతున్నాయని వారు ధ్వజమెత్తారు. సభ జరగాల్సిన ఆడిటోరియం వెలుపల వందలాది మంది చేరుకుని నిరసన ప్రదర్శన చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆడిటోరియం లోపల ట్రంప్ వ్యతిరేకులు, మద్దతుదారుల మధ్య యుద్ధ వాతావరణ నెలకొందని చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, ఈ గొడవలకు సంబంధించి ఎలాంటి అరెస్టులు జరగలేదని చికాగో పోలీసులు స్పష్టం చేశారు. (చిత్రం) డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా చికాగోలో నిరసనలు