ఆటాపోటీ

డోప్ దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాప్రియాటి
టెన్నిస్‌లో డోపింగ్ అన్న మాట వినిపిస్తే ముందుగా గుర్తుకొచ్చే పేరు జెన్నీఫర్ కాప్రియాటి. అసాధారణ ప్రతిభావంతురాలిగా ప్రశంసలు పొందిన ఆమె చిన్న వయసులోనే అత్యున్న శిఖరాలను అధిరోహించింది. కానీ, నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడి, డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకుంది. సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకొని మళ్లీ టెన్నిస్ ర్యాకెట్ పట్టుకున్నా, గతంలో మాదిరి సత్తా చాటలేకపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించింది.
మార్టినా హింగిస్
చిన్నతనంలోనే ఎవరూ ఊహించలేనంత పేరుప్రఖ్యాతులు ఆర్జించిన క్రీడాకారిణి మార్టినా హింగిస్. మార్టినా నవ్రతిలోవాను ఎంతో అభిమానించే హింగిస్ తల్లి తన కుమార్డెకు మార్టినా పేరు పెట్టింది. తల్లి ఆశలకు తగ్గట్టే హింగిస్ టెన్నిస్‌లో తిరుగులేని ప్రతిభ కనబరచింది. విజయాలు ఆమెను తప్పుడు మార్గం పట్టించాయి. ఒక్కసారిగా వచ్చిపడిన గౌరవం, డబ్బు ఆమెకు పట్టపగ్గాలు లేకుండా చేశాయి. తల్లితో విభేదించింది. ఒత్తిడిని తట్టుకోవడానికి ఉత్ప్రేరకాలను వాడింది. డోపింగ్ పరీక్షలో దోషిగా తేలి, అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో టెన్నిస్‌కు దూరమైంది. సస్పెన్షన్‌ను ముగించుకొని, కాప్రియాటి మాదిరిగానే హింగిస్ కూడా కెరీర్‌ను కొనసాగించేందుకు ప్రయత్నించింది. కాప్రియాటి మాదిరిగానే విఫలమైంది. అయితే, పట్టుదలతో శ్రమించి, డబుల్స్ విభాగంలో రాణిస్తున్నది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నది. ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్ సాధించింది. ఆ టోర్నీలోనే మరియా షరపోవా డోపింగ్ పరీక్షలో పట్టుబడింది.
గ్రెగ్ రూసెడ్‌స్కీ
బ్రిటన్‌కు చెందిన గ్రెస్ రూసెడ్‌స్కీ బలమైన సర్వీసులకు మారుపేరు. మెరుపు వేగంతో అతను చేసే సర్వీసులను తిప్పికొట్టడానికి ప్రత్యర్థులు ఎంతో కష్టపడేవాళ్లు. 2003లో ‘నాన్‌డ్రోలొన్’ అనే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు రుజువుకావడంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) అతనిని సస్పెండ్ చేసింది. ట్రైనర్లు ఇచ్చిన ఫుడ్ సప్లిమెంట్స్‌నే తాను వాడినట్టు చెప్పిన అతను, ఈ విషయంలో ఐటిఎఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వాదించాడు. ఫుడ్ సప్లిమెంట్స్ ఏవో, స్టిమ్యులెంట్స్ ఏవో స్పష్టంగా చెప్పలేదని ఆరోపించాడు. చివరికి అతని వాదనే నెగ్గింది. సస్పెన్షన్‌ను ఐటిఎఫ్ ఎత్తివేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోంది. కెరీర్‌ను కొనసాగించే అవకాశం రూసెడ్‌స్కీకి లభించలేదు.
ఆండ్రీ అగస్సీ
టెన్నిస్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు ఆండ్రీ అగస్సీ. అతను కూడా డోపింగ్ పరీక్షలో విఫలం కావడం విచిత్రం. 1997లో క్రిస్టల్ మెథాంఫెటమైన్‌ను వాడినట్టు డోపంగ్ పరీక్షలో తేలడంతో అతనిని సస్పెండ్ చేసింది. అయితే, తాను తన సహాయకుడి వద్ద ఉన్న పానీయాన్ని తాగానని, అందులో నిషిద్ధ ఉత్ప్రేరకం ఉందేమోనని అనమానం వ్యక్తం చేశాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కావడంతో అతని ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయితే, అప్పట్లో తాను అబద్ధం చెప్పానని, ఉద్దేశపూర్వకంగానే క్రిస్టల్ మెథాంఫెటమైన్‌ను వాడానని 2009లో రాసిన ఆత్మకథలో అగస్సీ పేర్కొన్నాడు. కానీ, అతని ధ్రువీకరణను సమాఖ్య అంగీకరించలేదు. అతనిపై కేసే లేనప్పుడు చర్యలు ఎలావుంటాయని ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది.
రిచర్డ్ గాస్క్వెట్
ఫ్రాన్స్‌కు చెందిన రిచర్డ్ గాస్క్వెట్ 2009లో డోప్ పరీక్షలో పట్టుబడి 12 నెలల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నాడు. మియామీ నైట్ క్లబ్‌లో ఒక గుర్తుతెలియని మహిళను ముద్దు పెట్టుకున్నానని, తాను డోప్ పరీక్షలో విఫలం కావడానికి అదే కారణమై ఉండవచ్చని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ, ట్రిబ్యునల్ అతని వాదనతో ఏకీభవించలేదు. ఫలితంగా అతను క్రీడా మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించాడు. 2012లో ఆర్బిట్రేషన్ కోర్టు అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది.