రాష్ట్రీయం

గ్రేటర్‌పై ‘డబుల్’ గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకేసారి తొమ్మిదిచోట్ల శంకుస్థాపనలు
ఉద్యమంగా చేపట్టిన మంత్రులు
ఎన్నికల ప్రచారాన్ని తలపించిన సభలు
హైదరాబాద్‌లో 10 వేల ఇళ్లు కడతాం
మంత్రి కెటిఆర్ వాగ్దానం
హైదరాబాద్, డిసెంబర్ 10: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని అధికారపక్షం ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. గురువారం ఒకే రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది చోట్ల పదివేల ఇళ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపనలు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన శంకుస్థాపనల్లో మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, టి పద్మారావు పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ పట్టుసాధించేందుకు ఉపయోగపడుతుందని ఆ పార్టీనాయకులు భావిస్తున్నారు. ఈ పథకానికి నగరంలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఎక్కడికక్కడ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. నెలకు వెయ్యి రూపాయల పించన్ పథకం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం టిఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో బాగా కలిసి వస్తాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి
గురువారం జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రులు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం తరహాలోనే ప్రసంగించారు. పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని మంత్రి కెటిఆర్ కోరారు. బాగ్‌లింగంపల్లిలో జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. సికిందరాబాద్ కంటోనె్మంట్‌లో జరిగిన ఇళ్ల శంకుస్థాపనలో కెటిఆర్ మాట్లాడుతూ ఒక్క సంవత్సరంలోనే హైదరాబాద్‌లో పదివేల ఇళ్లను నిర్మించనున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో హైదరాబాద్‌లో లక్షకు పైగా ఇళ్లను నిర్మించున్నట్టు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో రాష్టమ్రంతటా పర్యటించిన కెసిఆర్ పేదల కష్టాలను చూశారని, అందుకే పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రులు తెలిపారు.
(చిత్రం) హైదరాబాద్‌లో గురువారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు
శంకుస్థాపన చేసిన మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, పద్మారావు, నాయని, బిజెపి నేత కిషన్‌రెడ్డి