క్రీడాభూమి

టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్ డబుల్ ధమాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఈ ఏడాది చివరి ప్రపంచ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. నాలుగు దశాబ్దాల తర్వాత భారత బౌలర్‌కు తొలిసారి టెస్టు బౌలింగ్ విభాగంలో నంబర్ వన్ స్థానం లభించడం విశేషం. తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా ఇబ్బంది పెడుతున్న రవిచంద్ర న్ అశ్విన్ నంబర్ వన్‌గా నిలవగా, బ్యాటింగ్ విభాగంలో టాప్ పొజిషన్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆక్రమించాడు. ఏడాది మొత్తం మీద అశ్విన్ బౌలింగ్‌లో విశేష ప్రతిభ కనబరిస్తే, గాయాలతో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ స్మిత్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం విశేషం. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో చేజార్చుకున్న తర్వాత, మైఖేల్ క్లార్క్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా సేవలు అందిస్తున్న స్మిత్ 2015లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. తన కృషికి ప్రతిఫలంగా ప్రపంచ నంబర్ స్థానాన్ని సంపాదించాడు.

==============

దుబాయ్, డిసెంబర్ 31: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ బౌలర్‌గా, మేటి ఆల్‌రౌండర్‌గా నంబర్ వన్ స్థానాలను ఆక్రమించాడు. ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని అందుకున్న బిషన్ సింగ్ బేడీ 1973లో టెస్టు బౌలింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. బేడీ తర్వాత భారత్ తరఫున మరో బౌలర్ నంబర్ వన్ స్థానంలో నిలవడానికి 42 సంవత్సరాలు పట్టింది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది టెస్టులు ఆడిన అశ్విన్ 62 వికెట్లు కూల్చాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను నాలుగు మ్యాచ్‌ల్లో 31 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఇప్పటి వరకూ బేడీ ఒక్కడే మన దేశం తరఫున నంబర్ వన్ స్థానాకి ఎదిగాడు. భగవత్ చంద్రశేఖర్, కపిల్ దేవ్, అనీల్ కుంబ్లే తమతమ కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో స్థానంతో సరిపుచ్చుకున్నారు. బేడీ తర్వాత నంబర్ వన్‌గా ఎదిగిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది.
ఇప్పటి వరకూ నంబర్ వన్ స్థానంలో కొనసాగిన దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ దర్బన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో కేవలం 3.5 ఓవర్లు బౌల్ చేసి, వెన్నునొప్పి కారణంగా బౌలింగ్‌ను కొనసాగించలేకపోయాడు. ఈ కారణంగానే అతను నంబర్ వన్ స్థానాన్ని అశ్విన్‌కు అప్పగించాల్సి వచ్చింది. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) తృతీయ స్థానాన్ని సంపాదించుకోగా, భారత్ తరఫున రవీంద్ర జడేజా (ఆరో స్థానం) ‘టాప్-10’లో చేరాడు.
ఆల్‌రౌండర్లలోనూ ఫస్టే
అశ్విన్ టెస్టు ఆల్‌రౌండర్లలోనూ అగ్రస్థానంలో నిలిచాడు. అతను మొత్తం 406 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించగా, బంగ్లాదేశ్‌కు చెందిన షకీల్ అల్ హసన్ 384 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. స్టువర్ట్ బ్రాడ్ 9326 పాయింట్లు) 3వ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ విభాగంలో రవీంద్ర జడేజాకు 5వ స్థానం దక్కింది.
జట్లలో దక్షిణాఫ్రికా టాప్
టెస్టు హోదా ఉన్న జట్లలో దక్షిణాఫ్రికా నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. ఈ జట్టుకు 114 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్ రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు మూడో స్థానం లభించింది. వనే్డ విభాగంలో ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా మొదటి మూడు స్థానాలను సంపాదించాయి. టి-20 ఫార్మెట్‌లో శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
వనే్డ ర్యాంకింగ్స్
వనే్డ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఎబి డివిలియర్స్ 900 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, కేన్ విలియమ్‌సన్‌కు మూడో స్థానం దక్కింది. ఈ విభాగంలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆరు, శిఖర్ దావన్ ఏడు స్థానాలను సంపాదించారు.
వనే్డ బౌలింగ్ విభాగంలో అశ్విన్ ‘టాప్-10’లో చోటు దక్కించుకున్నాడు. అతను పదో స్థానంలో ఉండగా, సునీల్ నారైన్ (వెస్టిండీస్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) మొదటి మూడు స్థినాల్లో ఉన్నారు.
వనే్డ ఆల్‌రౌండర్ల విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజాకు ఎనిమిదో స్థానం లభించింది. మిగతా వారెవరూ ‘టాప్-10’ స్థానం దక్కించుకోలేదు. కాగా, షకీబ్ అల్ హ సన్ (బంగ్లాదేశ్), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక), మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
టి-20 ర్యాంకింగ్స్
టి-20 బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) నంబర్ వన్‌గా నిలవగా, అలెక్స్ హాలెస్ (ఇంగ్లాండ్)కు మూడో స్థానం దక్కింది. ‘టాప్-10’లో కోహ్లీ తప్ప భారత్ తరఫున ఎవరికీ స్థానం లభించలేదు.
టి-20 బౌలింగ్‌లో భారత్ తరఫున అశ్విన్ ఒక్కడికే ‘టాప్-10’లో చోటు దక్కింది. అతను ఐదో స్థానంలో ఉన్నాడు. సునీల్ నారైన్, బద్రీ, సేనానాయకే మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. కాగా, టి-20 ఆల్‌రౌండర్ల ‘టాప్-10’లో భారతీయులు ఎవరూ లేరు. షకీబ్ అల్ హసన్, షహీద్ అఫ్రిదీ, షేన్ వాట్సన్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. (చిత్రం) రవిచంద్రన్ అశ్విన్