సబ్ ఫీచర్

నాణ్యమైన నీరివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాగునీరు కరువైతే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. పేద ప్రజలు పనికి వెళ్ళలేరు. వైద్యపు ఖర్చులు పెరిగి అప్పులపాలవుతారు. అయినా ఈ రంగంలో మన దేశ ప్రగతి అంతంత మాత్రంగానే వుంది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2012లో ప్రపంచంలో 78.3 కోట్ల ప్రజలకు త్రాగునీరు అందుబాటులో లేదు. అయితే కొన్ని లెక్కల ప్రకారం, ప్రపంచంలో 300 కోట్ల ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు లభించడం లేదు.
మన దేశంలో త్రాగునీరు లేక అనేక గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. సుమారు 3.8 కోట్ల గ్రామీణ ప్రజలు రోగాల పాలవుతున్నారు. 2012లో 58 శాతం గ్రామీణ కుటుంబాలకు త్రాగునీరు లేదని జాతీయ సాంపిల్ సర్వే సంస్థ (ఎన్.ఎస్. ఎస్.ఓ.) తెలిపింది. 14.3శాతం కుటుంబాలు మాత్రమే ప్రభుత్వ సంస్థలు అందించే నీటిని పొందుతున్నారు. పట్టణాలలో ఈ శాతం 33, మొత్తం 28 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో సగానికంటే తక్కువ గ్రామీణ కుటుంబాలకే త్రాగునీరు అందుబాటులో వుంది. సుమారు 85 శాతం మంది భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు. 48 శాతం వర్షపు నీరు నదులలో కలుస్తున్నది. 18 శాతం మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. దేశంలో 445 నదులున్నప్పటికీ అవి కాలుష్యానికి గురువుతున్నాయి.
త్రాగునీరు పొందటంలో కూడా కాలం వృధా అవుతున్నది. 2014లో గ్రామీణ ప్రాంతాలలో నీరు తెచ్చుకోవడానికి సగటున 20 నిమిషాలు (పట్టణంలో 15 నిమిషాలు) పడుతున్నది. నీరు దొరికేచోట వేచి వుండటానికి 15 నిమిషాలు (పట్టణాలలో 16 నిమిషాలు) పడుతున్నది.
2014లో గ్రామాలలో 52.4 శాతం కుటుంబాలు ట్యూబ్/బోర్ బావుల ద్వారా నీరు పొందుతున్నారు. 2.7 శాతం కుటుంబాలకు మాత్రమే రక్షిత బావులు అందుబాటులో వున్నాయి. తొమ్మిది శాతం కుటుంబాలు రక్షణ లేని బావులపై ఆధారపడుతున్నారు. గృహాల వరకు పైపు నీరు లభించే కుటుంబాల శాతం 6.5 మాత్రమే ఆధారపడి వున్నారు.
2014 లెక్కల ప్రకారం గ్రామీణ కుటుంబాలకు త్రాగునీరు అందించడంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ప్రగతిని సాధించాయి. వీటిలో ముఖ్యమైనవి చండీగఢ్ (85.4 శాతం), పంజాబ్ (81.6 శాతం), లక్షద్వీప్ (79.7 శాతం), కేరళ (72.9 శాతం), డామన్ మరియు డయ్యు (72.6 శాతం). బాగా వెనుకబడిన రాష్ట్రాలు: మధ్యప్రదేశ్ (13 శాతం), ఝార్‌ఖండ్ (11.7 శాతం), చత్తీస్‌ఘడ్ (10.3 శాతం), మణిపూర్ (8శాతం), మిజోరామ్ (6.4 శాతం).
త్రాగునీరు సరఫరా విషయంలో నిధుల దుర్వినియోగం కూడా ఎక్కువగా వున్నట్లు తెలుస్తున్నది. కేంద్రం, రాష్ట్రాలు ఈ పథకంపై 8వ ప్రణాళికలో రూ.4000 కోట్లు ఖర్చుచేస్తే 12వ ప్రణాళిక (2012-17)లో రూ.68,000 కోట్లువరకు కేటాయించడం జరిగింది.
కరువు పరిస్థితులు, వరదల వల్ల నీటి నాణ్యత తగ్గుతున్నది. వాతావరణ మార్పుకు తగినట్లుగా నీటి సరఫరా పథకాలు వుండటం లేదు. బహుళజాతి సంస్థలు శీతల పానీయాలకు అధికంగా నీటిని వాడుతున్నాయి. ప్రభుత్వం కూడా సీసాలలో నీటిని ప్రోత్సహిస్తున్నది. అందువల్ల పర్యావరణం ప్రమాదంలో పడే ప్రమాదం వుంది.
త్రాగునీరు సమకూర్చడం కేవలం ప్రభు త్వ బాధ్యతే కాదు, నీరు వృధా కాకుండా వుండాలంటే ప్రజలు సహకరించాలి. వీధి కొళాయిలవద్ద నీరు వృధా అవడం చూసు తన్నాం. నీటి సరఫరాకు ఎంత ఖర్చుఅవుతుందో చాలామందికి తెలియదు. మరీ పేద ప్రజలకు త్రాగునీరు ఉచితంగా సరఫరా చేయడంలో తప్పు లేదు. మిగతా వారు ఖర్చులను భరించవలసిందే. ప్రస్తుతం పరిస్థితి ఇలా లేదు. ఖర్చులు పెరుగుతున్నా ఆదాయాలు పెరగడం లేదు. నీటి ధరలు క్రమబద్ధీకరణ చేయాలి.. ఎక్కువ నీరు ఇవ్వడానికంటే, నాణ్యతగల తక్కువ నీరు ఇవ్వడమే మంచిది.

- డా.ఇమ్మానేని సత్యసుందరం