హైదరాబాద్

భారీ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 11: ఐపిఎస్ అధికారి ఇంట్లో డ్రైవర్‌గా పని చేసిన ఓ వ్యక్తి ఆ ఇంటికే కన్నం వేశాడు. రూ. 3 కోట్లు విలువ చేసే డైమండ్ పొదిగిన నగలను మాయం చేశాడు. అయితే ఇటీవల డ్రైవర్ భార్య పుట్టినరోజు వేడుకల్లో ఆ నగలను వేసుకొని ఫొటోలు దిగడం చూసి అనుమానం వచ్చిన పోలీసులు పాత రికార్డులు తిరగేసి చూసేసరికి అసలు చోరుడు దొరికాడు. విశ్వసనీయ సమాచారం మేరకు కొండాపూర్‌లోని సైబర్ మెడోస్ కాలనీలో నివాసం ఉండే ఐపిఎస్ అధికారి శివప్రసాద్ రెడ్డి ఇంట్లో 2014లో భారీ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు అధికారి స్ట్రాంగ్ రూంను పగలగొట్టి అందులో ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. నగలకు వజ్రాలు పొదిగి ఉండటం వల్ల ఆ అధికారి మియాపూర్ పోలీసుస్టేషన్‌లో ఖరీదైన నగలు పోయాయని ఫిర్యాదు చేశారు. సైబర్ మెడోస్ గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఆ పోలీసుస్టేషన్‌కు చెందిన అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఐపిఎస్ అధికారి ఇంట్లో నగలు పోయాయనే విషయాన్ని తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు కూడా పర్యవేక్షణ చేపట్టారు. సదరు అధికారి ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసి మానేసిన రమేష్ భార్య గౌరీతో కలసి ఇటీవల ఒక బర్త్‌డే పార్టీలో ఖరీదైన నగలు ధరించి కనబడ్డాడు. అనుమానం వచ్చిన పక్కవారు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఫంక్షన్‌లో తీసిన ఫొటోలను పోలీసులకు చూపించారు. సదరు డ్రైవర్‌ను పోలీసుల తమ పద్ధతిలో విచారించగా అసలు విషయం మొత్తం పూసగుచ్చి వివరించినట్లు సమాచారం. ముందు పోలీసుల ముందు తనకేమీ తెలియదని బుకాయించిన దొంగను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. 2,3 రోజుల్లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. అయితే 2014 కేసు విషయం గోప్యంగా ఉంచిన పోలీసులు దొంగ దొరకడంతో ఈ నగల విషయం బయట పడింది. ఖరీదైన నగలు దొరకడంతో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించవచ్చని అంటున్నారు. రెండేళ్ల కిందటి కేసు కొలిక్కిరావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.