ఆటాపోటీ

ఏవి ఔషధాలు? ఏవి ఉత్ప్రేరకాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిర్వాకానికి, కోచ్‌లు, ఫిజియోథెరపిస్టుల నిర్లక్ష్యం తోడుకావడంతో చాలా మంది క్రీడాకారుల కెరీర్‌కు తెరపడుతున్నది. ఇందుకు తాజా ఉదాహరణగా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా డోపింగ్ ఉదంతాన్ని పేర్కోవాలి. రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు శ్రీకారం చుట్టిందని వాడా ఆధ్వర్యంలోని కమిటీ ఇటీవలే ప్రకటించడం, ఆ వివాదం చల్లారక ముందే రష్యాకే చెందిన షరపోవా తాను గత పదేళ్లుగా మెల్డోనియంను వాడుతున్నట్టు ప్రకటించడం మరోసారి ఈ సమస్యను తెరపైకి తెచ్చాయి. క్రీడాకారులే ఉద్దేశపూర్వకంగా ఉత్ప్రేరకాలను వాడుతున్నారా లేక తెలిసీతెలియకుండా మందులు వాడుతూ పట్టుబడుతున్నారా అన్న ప్రశ్నలకు రెండూ నిజమేనని సమాధానం చెప్పాలి.