ఆంధ్రప్రదేశ్‌

నియామకాలు ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కార్ నిర్ణయం కోసం డిఎస్సీ క్వాలిఫైడ్ల ఎదురుచూపు
నెల్లూరు, మార్చి 14: ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డిఎస్సీ2014)ల్లో ఉత్తీర్ణులైన వారు నియామకాల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అధికారుల పొరపాటు వల్ల అర్హతలుండి కూడా ఉద్యోగాల్లో చేరేందుకు తమ వంతు వచ్చే దాకా ఎదురుచూసే పరిస్థితిలో ఉన్నారు. విద్యాశాఖ ఎప్పుడు చెబితే అప్పటి దాకా ఉద్యోగంలో చేరేందుకు ఎదురుచూడక తప్పని స్థితిలో ఉన్న వారికి ఉద్యోగానికి ఎంపికైనామన్న ఆనందం కన్నా ఎప్పుడు తమ వంతు వస్తుందా అనే ఆందోళనే ఎక్కువగా ఉంది. జిల్లాలో డిఎస్పీ ప్రకటన సమయంలో ఉద్యోగ ఖాళీలకు హేతుబద్ధీకరణ అనంతరం తాజాగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలకు అంతరం ఉండటం, 18వ తేదీ నుంచి డిఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కొత్త అభ్యర్థులకు పోస్టులు ఎలా సర్దుబాటు చేయాలో జిల్లా విద్యాశాఖ అధికారులు తలపట్టుకుంటున్నారు. డిఎస్సీ 2014లో సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీకి సంబంధించి సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీ పోస్టుల్లో నియమితులైన అభ్యర్థులు మరో పోస్టుకు ఎంపికై రాజీనామా చేస్తే ఖాళీ అయిన ఎస్జీటీ పోస్టులను మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో 363 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో వాటిలో 62 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి. కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఆ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. జిల్లాలో మొత్తం 425 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, వీటి కోసం 2014 ఫిబ్రవరిలో జరిగిన డిఎస్పీ పరీక్షకు 13,874 మంది అభ్యర్థులు హాజరైనారు. 62 స్కూల్ అసిస్టెంటు పోస్టులకు 9,500 మంది పరీక్ష రాశారు. 363 భాషా పండితులు, పి ఇ ఇ, ఎస్జీటీ పోస్టులకు 4,869 మంది పరీక్షలు రాశారు. డి ఎస్పీ ప్రకటన రెండేళ్ల కిందట జారీచేసి ఆలస్యంగా నియామక ప్రక్రియ చేపట్టారు. అప్పట్లో జిల్లాలో డైస్ లెక్కల ఆధారంగా ఉద్యోగ ఖాళీలను చూపించారు. కొన్ని చోట్ల తగినంతమంది విద్యార్థులు లేకపోయినా తప్పుడు లెక్కలు చూపించి పోస్టులు కొనసాగించారు. పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ సంఖ్యను అనుసంధానించి క్రమబద్ధీకరించిన ఫలితం జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై గణనీయంగా కనిపించింది. దాని ప్రకారం ఇటీవల హేతుబద్ధీకరణ జరపటంతో పాటు ఇరవై మంది లోపు పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలను మూసివేసి కి.మీ. పరిధిలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేశారు. 80 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా గుర్తించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రక్రియల వల్ల జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు చాలావరకు తగ్గిపోయాయి. నోటిఫికేషన్ ప్రకారం కావాల్సిన ఉద్యోగాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఈనెల 18వ తేదీ నుంచి డి ఎస్పీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా పరిస్థితుల్లో కొత్తగా వచ్చే వారికి ఎక్కడ ఉద్యోగాలు చూపించాలనే సమస్య ఉత్పన్నమవుతోంది. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు ఇంతవరకూ జాయిన్ కాలేదు. కోరుకున్న పాఠశాలల్లో ఖాళీలు లేకపోవడమే. మరికొన్ని పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నా వీరు పనిచేస్తున్న పాఠశాలల్లో ఒక్కరే ఉపాధ్యాయులు కావటం, ఆ పాఠశాలలకు ఎవరు బదిలీ అయ్యేందుకు ఎక్కువ శ్రద్ధ చూపకపోవడంతో అక్కడే వారు విధులు నిర్వర్తిస్తున్నారు. నూతనంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయితే తాము రిలీవ్ అవుతామని మరికొందరు ఎదురు చూస్తున్నారు. 316 మంది అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఖాళీ పోస్టులను కోరుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.